మరి కొద్దిసేపట్లో వైఎస్ఆర్ సీఎల్పీ సమావేశం

 హైదరాబాద్: నూతనంగా ఎన్నికైన వైఎస్ఆర్ సీపీ పార్టీ ఎమ్మెల్యేల సమావేశం గురువారం జరగనున్నది. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీకి చెందిన అభ్యర్థులు విజయఢంకాను మోగించారు. కొత్తగా ఎన్నికైన వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు నగరంలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో సమావేశమై భవిష్యత్లో వ్యవహారించాల్సిన తీరుపై చర్చించనున్నారు. ముఖ్యంగా ఇప్పుడు నెలకుని ఉన్న రైతు సమస్యలపై ఉద్యమాలు చేపట్టడానివి వైఎస్ఆర్ సీఎల్పీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. దీనికి సంబంధించి గత మూడు రోజుల కిందట వైఎస్ఆర్ సీపీ నూతన ఎమ్మెల్యేలు చంచల్గూడ జైలులో జగన్ ను కలిసిన సందర్భంగా సూచించారు. అసెంబ్లీ బయట, లోపల ప్రజా సమస్యలపై పోరాడటానికి వైఎస్ఆర్ సీఎల్పీ భారీ కార్యక్రమానికి వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటుంది. ఇదిలా ఉంటే నూతనంగా ఎన్నికైన వైఎస్ఆర్ ఎమ్మెల్యేలతో ఈ నెల 22న అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రమాణం చేయించున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: