మరి కొద్దిసేపట్లో కొత్త ఎక్సైజ్ నోటిఫికేషన్

 హైదరాబాద్: రాష్ర్టంలో మద్యం అమ్మకాలు, లైసెన్స్ పై రాష్ర్ట ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేయనున్నది. దీనికి సంబంధించి ఎక్సైజ్ శాఖలో కొత్త పాలసీని తెస్తూ సోమవారం మధ్యాహ్నం నోటిఫికేషన్ విడుదలకు ఆ శాఖ సన్నాహాలు చేస్తోంది. మునుపటి మాదిరిగా కాకుండా ఈ ఏడు నుంచి లాటరీ విధానం ద్వారా లైసెన్స్ లను ఇవ్వాలనీ ఫ్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. గతంలో వైన్స్ దుకాణాల లైసెన్స్ ల జారీపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఎవరికి తోచిన విధంగా వారు వేలం పాటల ద్వారా వైన్స్ లను దక్కించుకోవడం, లక్షల్లో పలకాల్సిన వైన్స్ లను కోట్ల రూపాయలకు వేలం పాడటం, సిండికేట్లుగా ఏర్పడటం, వారు తమకు తోచిన విధంగా మద్యంను అమ్మడం పట్ల అనేక విమర్శలొచ్చాయి. రాష్ర్ట ప్రభుత్వానికి మచ్చ తెచ్చాయి. దీనితో ఈ ఏడు నుంచి ఎక్సైజ్ విధానాన్ని మార్చారు. గతంలో మాదిరిగా కాకుండా లాటరీల ద్వారా వైన్స్లను కేటాయిస్తారు. బినామీలకు ఇవ్వరు. తెల్లరేషన్ కార్డుల దారులకు అసలు ఇవ్వరు. బ్లాక్ మనీకి తావు లేకుండా ఐటీరిటర్ను దాఖలు చేసి, పూర్తిగా వైట్ మనీని డిపాజిట్ చేసే వారికే దీంట్లో పాల్గొనే విధంగా పాలసీని తీసుకువచ్చారు. ఈ కొత్త పాలసీ ద్వారా ఎమ్మార్పీ ధరలకే మద్యం అమ్మకాలు జరుపుతారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉన్న వైన్స్ లకు అదనంగా మరో 750 పెంచాలనీ భావించిన అధికారుల తీరుపై సీఎం అంతగా ఆసక్తిని చూపలేదని సమాచారం.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: