కొత్త పురపాలక చట్టానికి గవర్నర్‌ బ్రేక్!

Edari Rama Krishna

అసెంబ్లీలో ఆమోదించిన కొత్త మున్సిపల్‌ బిల్లుకు గవర్నర్‌ బ్రేక్‌ వేశారు. అయితే బిల్లులో కొన్ని సవరణలు చేయాలని ఈ మేరకు గవర్నర్‌ సూచించారు. కొన్ని అంశాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. గవర్నర్‌ సూచించిన అంశాలతో ప్రభుత్వం తాజాగా ఆర్డినెన్స్‌ జారీ చేసింది.


గవర్నర్‌ కొన్ని అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొర్రీలు వేశారు. కొత్త పురపాలక చట్టం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బిల్లు తీసుకువచ్చింది.   కేంద్రానికి బిల్లు పంపాలని నిర్ణయించడమే కాకుండా దానిని రిజర్వ్‌లో ఉంచారు. అసెంబ్లీ ప్రొరోగ్‌ కావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో… గవర్నర్‌ సూచించిన సవరణలతో తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్‌‌ను జారీ చేసింది.  ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభ, మండలి ఆమోదం కూడా పొందింది. 

వాస్తవానికి ఆ మరుసటి రోజే గవర్నర్‌ ఆమోదం పొంది కొత్త చట్టం అమల్లోకి రావాల్సి ఉంది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వానికే పూర్తి స్థా యి అధికారాలు ఉండటం పట్ల నరసింహన్‌ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బిల్లుకు ఆయన మరికొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా సదరు బిల్లుకు ఆయన మరికొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గవర్నర్‌ సూచించిన అంశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది 

WhatsAppFacebookTwitterLinkedIn
Share


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: