వడ్లగింజలో బియ్యపు గింజ : ఢిల్లీలో మన ‘ఏపి’సోడ్ ఇదేనయా...

            వడ్లగింజలో బియ్యపు గింజ అన్న సామెతలా తయారైంది మన ఏపికాంగ్రేస్ పరిస్థితి. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఢిల్లీలో మన‘ఏపి’సోడ్ ఇదే.             పాలనపై పట్టులేకనో, పాలనపై అనుభవంలేకనో,లేక అధిష్టానం అంటే భయభక్తులో తెలియదు కాని చీమచిటుక్కుమన్నా సరే మన ఏపిసోడ్ ఢిల్లీకి మారుతోంది.అక్కడేమైనా సొల్యూషన్ దొరికిందా అంటే ఇప్పటి వరకు మన ఏపి పరిస్థితి ఏమి మారలేదు. అంటే ఢిల్లీ పేరుతో హడావిడీ అదో ఇదో ఏదో జరగబోతుందని ఆత్రుత,ఏమితేలకుండానే ఇంటిముఖం పట్టడం షరామామూలై పోయింది.             మంత్రులు మాట విననప్పుడు, కోవర్టుల గోల అధికమైనపుడు,పిసిసి,సిఎం లమద్య ప్రచ్చన్న పోరు ముదిరినపుడు,ఉపఎన్నికల్లో ఓడిపోయినపుడు ఇలా ఒకటేమిటి ఎన్నోసార్లు డిల్లీపెద్దలు హైదరాబాద్ రావడం అంతా తెలుసుకోవడం,ఆతర్వాత ముఖ్యనేతలను ఢిల్లి పిలిపించుకోవడం,నానా చర్చలు జరపడం జరిగింది.ప్రతిసారి మంత్రులపదవులు ఊడుతున్నాయి,కిరణ్ తన కోటరీని కొత్తగా తనవారితో భర్తీచేసుకోనున్నారని ఒకసారి,పిసిసి చీఫ్ బొత్స తనమార్కు చూపించనున్నారు సిఎం సీటు మారనుంది అని మరోసారి,కోవర్టుల జాబితాలోను మంత్రులు పోయి వారిస్థానంలో పలానా వారికి ఛాన్స్ దక్కనుందని ఇలా ఎన్నో ఎన్నెన్నో ఊహాగానాలు, ఢిల్లీ వెల్లిన పెద్దల రాకకోసం వేయికళ్లతో ఎదిరిచూపు,తీరా వచ్చాక తుస్సు. అంతా ఎప్పటిలాగే,మనకాంగ్రేస్ లో అదే గోలే.           తాజా ఏపిసోడ్ లో మాత్రం కాస్తా హడావిడి ఎక్కువ జరిగింది. సిబిఐ ఉచ్చులో మంత్రి దర్మాన పడిపోవడం,ఆయన రాజీనామా చేయడం,మద్దతుగా పెద్దసంఖ్యలో మంత్రులు నిలువడంతో ఈసారి మార్పులు తథ్యం అనుకున్నారు. మార్పుల మాట ఎలా ఉన్నా ధర్మానను ఇంటికి పంపించడం ఖాయం అనుకున్నారు. ఢిల్లీలో లొల్లి అదే స్థాయిలో కనిపించింది. కాని ఏమయింది అంతా మొదటికే వచ్చింది. రాష్ట్రం కష్టాల ఊబిలో ఉంటే అదంతా విడిచి కుర్చీలకోసం మనపాలకులు ఢిల్లీలో పాకులాడుతున్నారన్న ఓఅపవాదు అదనంగా మూటగట్టుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: