ఏపీ ప్రజలకి..."ఘోరమైన అవమానాలు"...జనసేన తీరు మారదా..???

NCR

ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. అందరూ ఊహించినట్టుగానే జగన్ రెడ్డి సీఎం అయ్యారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ , జగన్ కి శుభాకాంక్షలు తెలిపారు. జనం మెచ్చిన నేతగా జగన్ త్వరలో సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ, ఇక్కడే ఏపీ ప్రజలకి ఘోరమైన అవమానాలు ఎదురవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్నికల ఫలితాలలో ఏపీ ప్రజలు మూకుమ్మడిగా జగన్ కే జై కొట్టారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై కనీసం సానుకూలత చూపలేదు. దాంతో చంద్రబాబు 23, పవన్ కళ్యాణ్ 1 స్థానానికి పరిమితం అయ్యారు. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాలలో ఘోరమైన వైఫల్యం చెందటమే. అయితే ప్రజా తీర్పుని ఎవరైనా గౌరవించాల్సిందే. కానీ

 

ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజలని భాధలు, అవమానాల నుంచీ విముక్తి చేయడానికే పార్టీ  పెట్టిన జనసేన పార్టీనే ,ఇప్పుడు ఏపీ ప్రజలని అమ్మనా బూతులు తిట్టడం ఆశ్చర్యాన్ని కలిగించడంతో పాటు. జనసైనికుల అసలు రంగు బయట పడేలా చేసింది. ప్రజలని ఉద్ధరించడానికే రాజకీయాల్లోకి వచ్చానని, మార్పు దిశగా తన పయనం ఉంటుందని చెప్పే పవన్ కళ్యాణ్ తన జనసైనికులని అదుపులోకి పెట్టుకోలేక పోవడం మొదటి తప్పిదం. రాష్ట్రాలని దోచుకునే నాయకులని, దగుల్బాజీ లని చూసి చూడనట్టు వదిలేస్తున్నప్పుడు మా జనసైనికులు మోటార్ సైకిల్ సౌండ్ చేస్తూ వెళ్తే తప్పేంటి అన్నప్పుడే జనసైనికులు రెచ్చి పోయారు. ఎన్నికల సమయంలో వైసీపీ, తెలుగు దేశం నేతలని తమ తమ వాట్సప్ గ్రూప్స్ లో సోషల్ మీడియాలో నోటికి వచ్చినట్టు అన్న మాటలు ఎవరూ మర్చిపోలేదు. జనసైనికులకి కుదురులేదు అంటూ రాజకీయ విశ్లేషకులు సైతం విమర్శలు చేసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అయితే..

 

ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ తాజా ఓటమిని ఉద్దేసింది తన అభిమానులు అయిన జనసైనికులు మళ్ళీ తమ నోటికి పని చెప్పారు. అయితే ఈ సారి వారి టార్గెట్ పార్టీలు కాదు , నేతలు కాదు. నేతల నుదిటిరాతలని మార్చే ప్రజలే వారి టార్గెట్. మీ బాధలు తీర్చటానికి పవన్ కళ్యాణ్ కావాలి, మీ కష్టాలు వెలుగెత్తి చెప్పడానికి పవన్ కళ్యాణ్ కావాలి, కానీ ఓటు వేయడానికి పవన్ కళ్యాణ్ అవసరం లేదా గడ్డి తినే ప్రజలు అంటూ నోటికి వచ్చినట్టుగా తిడుతున్నారు. విజయనగం జిల్లా ప్రజలకోసం పవన్ ఎంతో తపించారు అంటూ ఆ జిల్లా ప్రజలని తిట్టిన వైనం చూస్తే ఇలాంటి తిట్లు ఎక్కడా వినలేదని అనుకోక మానరు. రౌడీ రాజ్యం వస్తుంది జగన్ వస్తే అని వేదాలు వల్లించిన నేత మరి ఈ తరహాగా తన అభిమానులు వ్యవహరించేలా చేస్తున్నా కిమ్మనకుండా ఉండటం వెనుక అర్థం, పరమార్ధం ఏమిటి.

 

ఏపీ ప్రజలకి ఎవరిపై నమ్మకం ఉంటె వారినే గెలిపించుకుంటారు వారి మనోభావాలని కించపరిచే హక్కు జనసేనకి ఎవరు ఇచ్చారు అంటూ పవన్ కళ్యాణ్ పై ఆయన పార్టీ నాయకులు , కార్యకర్తలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పాటికే సహనం కోల్పోతే, అధికారంలోకి వస్తే ఇంకేం పాలిస్తారు, మీరు తీరు మారదా పవన్ కళ్యాణ్  అంటూ జనసేనానిపై  తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏపీ ప్రజలు. ఈ దఫా ఏ ఎన్నికల్లో పోటీ చేసిన చిత్తు చిత్తుగా ఓడించి తీరుతామని తమదైన శైలిలో చెప్తున్నారు ఏపీ ప్రజానీకం. జనసేనాని ముందు మీ వాళ్ళని మార్చు తరువాత దేశాన్ని, ఏపీని మార్చుదుగానీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: