“ఎన్నికల రిగ్గింగ్‌ లో సుప్రీం కోర్టు ప్రమేయం ఉందేమో?” కాంగ్రెసోళ్ళు ఇంతకు తెగించారు!

విభిన్న కేసుల్లో సుప్రీం కోర్ట్ తీర్పులు మాత్రమే ఇస్తుంది. చట్టాలు చేసేది కెంద్రంలో పార్లమెంట్ రాష్ట్రాల్లో అసెంబ్లీ అంటే శాసన నిర్మాణ సభలు మాత్రమే. చంద్రబాబు, ఉదిత్ రాజ్, రాహుల్ గాంధి లాంటి లా మేకర్లు చేసిన చట్టాలని అమలు చెసే వ్యవస్థలైన సుప్రీం కోర్ట్,  ఎన్నికల సంఘం,  సీబీఐ, ఈడీ తదితర వ్యవస్థలపై ఈ లా మేకర్లు తరచుగా విరుచుకుపడటం ఈ దేశ దౌర్భాగ్యం. సుప్రీం కోర్ట్ తదితర న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు నచ్చక పోతే శాసనాలు మార్చే అధికారం లా మేకర్స్ కు ఎలాగైనా ఉన్నాయి. ఇలా రాజ్యాంగం నిర్వచించిన వ్యవస్థలను తరచుగా దూషించటం ప్రజాస్వామ్య లక్షణం కాదని అంటున్నారు పలువురు విశ్లేషకులు. తన ఎన్నికల వైఫల్యాల ను ఈ రాజ్యాంగ వ్యవస్థలపై నెట్టివేయటం అవి సరిగా పనిచేయలేదంటూ చేస్తున్న వ్యాఖ్యలు భారత ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తున్నాయి. దీనికి అంతం ఉండదా!

తాజాగా:  “ఎన్నికల రిగ్గింగ్‌ లో సుప్రీం కోర్టు ప్రమేయం ఉందేమో?” అంటూ కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ సంచలన ఆరోపణ చేశారు. మొత్తం వీవీప్యాట్లు లెక్కించాలనే పిటిషన్‌ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చడంపై ఆయనపై విధంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ‘‘మొత్తం వీవీప్యాట్ల ను లెక్కించాలనే పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే ఎన్నికల రిగ్గింగులో సుప్రీంకోర్టు  ప్రమేయం ఏమైనా ఉందా? ఎన్నికలకోసం ప్రభుత్వ పనులు మూడు నెలలు పూర్తిగా స్థంభించి పోయాయి. వీవీప్యాట్లను లెక్కించడానికి రెండు-మూడు రోజులు సమయం తీసుకోవడంలో అభ్యంతరమేంటి?’’ అనే అర్థంలో ఆయన హిందీలో ట్వీట్ చేశారు. కొద్ది రోజుల క్రితమే తనకు టికెట్ నిరాకరించడంతో బీజేపీని వీడిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.
 
ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని చిక్కుల్లో పడేసే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల సంఘంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఎన్నికల షెడ్యూలు విడుదల చేసిన నాటి నుంచే అధికారంలో ఉన్నపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ అనేక విమర్శల్ని ఈసీ ఎదుర్కుంటోంది.
 
ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై ముగింపు వచ్చేసరికి వీవీప్యాట్ల లెక్కింపు అంశాన్ని విపక్షాలు ప్రధానంగా తెరపైకి తెచ్చాయి. మంగళవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 22పార్టీల నేతలతో ఢిల్లీలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో  వీవీపీ ప్యాట్ల లెక్కింపు అంశాన్ని ప్రధానంగా చర్చకు తీసుకువచ్చారు. సమావేశానంతరం ఇదే విషయాన్ని ఈసీ ముందుకు విపక్షనేతల బృందం తీసుకెళ్లింది. దీనిపై ఈరోజు (బుధవారం) ఈసీ ఒక నిర్ణయం ప్రకటించింది కూడా!
 

ఈసీ నేటి తనప్రకటన ద్వారా వీవీప్యాట్‌ల లెక్కింపు వ్యవహారంలో విపక్షాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లెక్కింపు ప్రక్రియను మార్చేందుకు నిరాకరించిన ఈసీ ముందు గా ఈవీఎంల లెక్కింపు జరుగుతుందని స్పష్టం చేసింది. ముందుగా ఐదు  వీవీప్యాట్‌లను లెక్కించాలని విపక్షాలు మంగళవారం ఈసీని కలిసి వినతిపత్రం సమర్పించిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఈవీఎం, వీవీప్యాట్‌లపై రాద్ధాంతానికి స్వస్తిపలికి లెక్కింపు ప్రక్రియకు సహకరించాలని, ఫలితాలను అంగీకరించా లని బీజేపీ కోరింది. విపక్షాలు మాత్రం ఈసీ తీరును తప్పుపడుతున్నాయి. వీవీప్యాట్‌ల లెక్కింపునకు ఈసీకి ఉన్న అభ్యంతరమేంటని ప్రశ్నించాయి. ఇక వీవీప్యాట్‌ల లెక్కింపు సంఖ్యను పెంచాలన్న విపక్షాల అప్పీల్‌ ను తోసిపుచ్చిన సుప్రీం కోర్టుపై కాంగ్రెస్‌ నేత, వాయువ్య ఢిల్లీ మాజీ ఎంపీ ఉదిత్‌ రాజ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: