వారసుల గోల ఎక్జిట్-పోల్స్ లీల! ముఖ్యమంత్రుల తనయులు కర్ణాటక - ఏపిలో ఓడిపోవడం గ్యారెంటీ!

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇస్తున్న షాక్ లతో ఎప్పుడు తన ప్రభుత్వం ఉంటుందో? ఊడుతుందో? చెప్పుకోలేక తలలు పట్టుకుంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామికి, ఆయన తండ్రి మాజీ ప్రధాని హెచ్ డి దేవే గౌడ ఇద్దరికి తలనొప్పులు మొదలయ్యాయి అది వారి వాసుడు నిఖిల్ కుమార గౌడ రూపంలో. 

కుమారుడు నిఖిల్ కుమార గౌడకు ఓటమి తప్పదని వస్తున్న సర్వే నివేదికలు ముఖ్యమంత్రి కుటుంబానికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇప్పుడు వారి నిమిత్తం లేకుండా జరిగిపోతున్న రాజకీయాలు మింగుడు పడటం లేదు. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాండ్యా నుంచి ఆయన తనయుడు నిఖిల్ కుమార గౌడ పోటీ చేశారు. సినీనటుడు, మాజీ ఎంపీ అంబరీష్ మరణంతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన భార్య, సినీనటి సుమలత అంబరీష్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. కారణం కాంగ్రెస్ ఆమెకు జేడిఎస్ పోత్తులో భాగంగా నిఖిల్ కుమార గౌడకు ఆ సీటు కేటాయించారు. 

కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో సుమలత అంబరీష్ ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఈ స్థానంపై కన్నేసిన జేడీఎస్ ఏకంగా ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడునే రంగంలోకి దింపారు. అమబరీష్ను మాండ్యా ప్రజలు అమితంగా ఆరాదిస్తారు. దీనికితోడు ఇక్కడ బీజేపి సుమలత అంబరీషుకే మద్దతు నిస్తుంది. సుమలత, నిఖిల్ ఇద్దరూ సినీనటులే కావడం, ఒకేసారి రాజకీయ రంగప్రవేశం చేయడంతో ఫలితంపై తీవ్ర ఆసక్తి నెలకొంది. సినీ రంగం నుండి సీనియర్ జూనియర్ నటులు అనే బేధం లేకుండా సుమలత తరపున ప్రచారం హోరెత్తించారు. 

మాండ్యా ఫలితంపై ఆసక్తికర చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఎగ్జిట్-పోల్ ఫలితాలు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి కాషాయం లాంటి వార్తను అందించాయి. న్యూస్9-సీ-ఓటర్ సర్వేలు సుమలతకు అనుకూలంగా ఫలితాలు ఇచ్చాయి. దీంతో జేడీఎస్, కాంగ్రెస్ శ్రేణుల్లో కలవరం రేపుతోంది. మాండ్యా లోక్‌సభ స్థానం నుంచి సుమలత గెలిచే అవకాశముందని ఈ సంస్థ ఎగ్జిట్‌-పోల్స్‌లో అంచనా వేయడంతో జేడీఎస్ శిబిరంలో ఆందోళన నెలకొంది. దళిత ఓట్లలో కొన్ని, మహిళల ఓట్లు, మైనార్టీ గ్రూప్స్ ఓటర్లు సుమలత వైపు మెుగ్గు చూపారని ఆమెకే ఓటు వేశారని సీ-ఓటర్ తన సర్వేలో స్పష్టం చేసింది. 

నిఖిల్ కుమార, ప్రజ్వల్ రేవణ్ణ ఇద్దరు ఈ దేవేగౌడ తాతగారి వారసులే సుమా! 

దీంతో మాండ్యా లోక్‌సభ స్థానం ఫలితం ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ కర్ణాటకలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. 'న్యూస్ 9-సీ ఓటర్ ఎగ్జిట్-పోల్' ఫలితాలపై సరికొత్త చర్చ మెుదలైంది. మాండ్య నుంచి ముఖ్యమంత్రి తనయుడు ఓడిపోతాడని స్పష్టం చేసిన సర్వే, కల్బుర్గి లోక్-సభ స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే సైతం ఓడిపోతారు అంటూ చెప్పుకొచ్చింది. 

కర్ణాటకలో బీజేపీ 18 లోక్-సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని అలాగే కాంగ్రెస్-7, జేడీఎస్-2 చోట్ల గెలిచే అవకాశం ఉందని తెలిపింది. న్యూస్9-సీఓటర్ సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్-పోల్ ఫలితాలపై కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల్లో ఆందోళన మెుదలైంది. ఎప్పుడు ఫలితాలు విడుదల అవుతాయా? అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
అయితే దాదాపు ఇదే పరిస్థితులో ఆంధ్రప్రదేశ్ నారా లోకెష్ -  సన్ ఆఫ్ ఏపి సీఎం - నారా చంద్రబాబు నాయుడు తనయుడు మంగళగిరి నియోజకవర్గ శాసనసభ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. ఆయన ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇప్పటికే చంద్రబాబు నాయుణ్ణి ముప్పేట దాడితో రోజూ మూడు చెరువుల నీరు తాగిస్తూ ఉన్నాడు. 

ఇలా అపర చాణక్యుడు  అంటూ నారా చంద్రబాబు నాయుడికి జాకీలెసే టిడిపి పంచమాంగ దళాలు ఇప్పుడు చంద్రబాబు చెసే రాజకీయాలను చాణక్యం అనరని అంతా దగా చెసే శకుని తరహా రాజకీయమని అర్ధం చేసుకుంటున్నారు. చాణక్యమంటే స్వార్ధం ఆలోచించకుండా సర్వదా దేశ ఐకమత్యాన్ని ప్రజా క్షేమాన్ని కోరేది అని అర్ధం చేసుకుంటే చాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: