రాజకీయ నిష్క్రమణను ట్విట్టర్ వేదికగా ప్రకటించిన బండ్ల గణేష్!

Edari Rama Krishna
బండ్ల గణేష్..టాలీవుడ్ లో అత్యంత చిన్న స్థాయి నుంచి వరుసగా సూపర్ స్టార్ సినిమాలు తీసే స్థాయికి అతి వేగంగా ఎదిగిన పేరిది.  సినిమాలకంటే కూడా తను మాటల-చేతల వివాదాల వల్ల వార్తల్లో ఎక్కువుండే బండ్ల గణేష్ ను రాహూల్ గాంధీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం అప్పుడో సెన్సేషన్. 


ఒక్కసారిగా రాజకీయాల్లోకి దూసుకు వచ్చిన బండ్ల గణేష్ టీఆర్ఎస్ పార్టీని, నాయకులను తన మాటలతోనే చెడుగుడు ఆడుకున్నారు.  సినిమాటిక్ గా కాంగ్రెస్ పవర్ లోకి రాకపోతే గొంతు కోసుకుంటానన్నీయన..ఫలితాల తరువాత మీడియాను తప్పించుకు తిరగాల్సొచ్చింది. 


ఇప్పుడు హఠాత్తుగా ట్విట్టర్ వేదికగా రాజకీయ నిష్క్రమణను అనౌన్స్ చేశారు.. ఆ ట్విట్లు మీకోసం..
నా వ్యక్తిగత కారణాల తో రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నాను. నాకు అవకాశం కల్పించిన రాహుల్ గాంధీ గారికి, ఉత్తమ్ గారికి కృతజ్ఞతలు. ఇక నుంచి నేను ఏ రాజకీయ పార్టీ కి సంబంధించిన వాడిని కాదు.

— BANDLA GANESH (@ganeshbandla) April 5, 2019 కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గా నా విమర్శలు, వ్యాఖ్యల వల్ల బాధపెట్టిన వారిని పెద్ద మనసుతో క్షమించమని కోరుతున్నాను.
మీ
బండ్ల గణేష్🙏🏻

— BANDLA GANESH (@ganeshbandla) April 5, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: