అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిందేనంటున్న పవన్ : ఎమ్మెల్యేగానా..ముఖ్యమంత్రిగానా?
అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్న కామెంట్లను, డైలాగులను వింటున్న ఏపీ ప్రజానీకం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగు పెడతావో..? లేకపోతే ముఖ్యమంత్రిగా అడుగు పెడతావో? అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు.
గత సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపిన సమయంలో చంద్రబాబు తప్పు చేస్తే కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి చంద్రబాబు వచ్చాక ఆయన ప్రభుత్వం పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా గట్టిగా నిలదీసిన సందర్భాలు లేవని...ఇంతటి వైఖరి కలిగిన కళ్యాణ్ బాబు అసెంబ్లీలో అడుగు పెట్టిన ఒకటే లేకపోయినా ఒకటే అని మరికొంతమంది ఏపీ లో ఉన్న ప్రజలు కామెంట్లు చేస్తున్నారు.