లోకేష్ పై ట్రోలింగ్ దెబ్బ .. అందుకే చంద్ర బాబు ఈ నిర్ణయం ..!

Prathap Kaluva

చంద్ర బాబు తనయుడు నారా లోకేష్ ఈ మధ్య ప్రెస్ మీట్లు పెట్టకుండా కేవలం ట్విట్టర్ కే పరిమితం అయ్యాడు. దీని వెనుక చంద్ర బాబు ఆదేశం ఉందని తెలుస్తుంది. ఎవరినైనా విమర్శించాల్సి వచ్చినా కూడా ట్విట్టర్ ఓపెన్ చేస్తున్నారు. బాబుగారి భజన మీడియా కూడా ట్విట్టర్ లో అయ్యగారు పెట్టిన పోస్టింగ్ లను కాపీ చేసుకుని వాటినే అపురూపంగా టీవీల్లో, పేపర్లలో చూపించుకుంటున్నాయి.


ట్విట్టర్ లో లోకేష్ స్పందన ఇదీ అని, ట్విట్టర్ వేదికగా చెడామడా వాయించేసిన చినబాబు అనీ, ట్విట్టర్ లో గట్టిగా సమాధానమిచ్చిన మంత్రిగారని.. రకరకాల టైటిల్స్ తో రచ్చ చేస్తోంది అనుకూల మీడియా. ఐటీగ్రిడ్ వ్యవహారంలో కూడా పూర్తిగా ట్విట్టర్ తోనే సమాధానాలు చెబుతున్నారు లోకేష్. ఇంతకీ లోకేష్ గొంతుకేమైనా అయిందా, లేకపోతే ఆయన నోరు తెరిస్తే ప్రళయం ఏమైనా ముంచు కొస్తుందా అర్థం కావట్లేదని తెలుగుదశం పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి.


అయితే చంద్రబాబే లోకేష్ నోటికి తాళం వేశారని ఆయన సన్నిహితులంటున్నారు. అయ్యగారు జనాల్లోకి రావాలని, ఉపన్యాసాలు దంచేయాలని ఉబలాటపడిన ప్రతిసారీ ఒకడుగు ముందుకేస్తే, నాలుగడుగులు వెనక్కు పడుతోంది. చినబాబు తెలుగు పలుకులు ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ లు పడుతున్నాయి. అందుకే ఈమధ్య ఎక్కడా నోరు చేసుకోవడం లేదు లోకేష్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: