మమత కు సుప్రీం షాక్!

పశ్చిమ బెంగాల్‌ లో చిట్ గేట్ స్కాండల్ గా పేరు పడ్డ శారదా చిట్స్ ఫండ్స్ కుంభకోణం  కేసులో ఈ రోజు (మంగళవారం) సుప్రీం కోర్టులో ఇరుపక్షాల మద్య వాదనలు కొనసాగాయి. ఈ కేసు విషయమై కోల్‌కత్తా నగర పోలీస్ కమీషనర్ ను సీబీఐ ముందు తప్పనిసరిగా హాజరు కావాలని ముగ్గురు సభ్యులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.


పోలీస్ కమిషనర్ సీబీఐ విచారణకు హాజరైతే వచ్చిన ఇబ్బందులు ఏమిటని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్ సూటిగా ప్రశ్నించారు.

శారదా కుంభకోణం కేసులో విచారణకు వచ్చిన కేంద్ర విచారణ సంస్థ (సీబీఐ) అధికారులకు బెంగాల్ ప్రభుత్వం నుండి  ఆదివారంనాడు సహాయనిరాకరణ ఎదురైంది. ఈ విషయమై బెంగాల్ సీపీని అరెస్ట్ చేసేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని మమత బెనర్జీ ఆరోపణలు చేశారు. అంతే కాదు డిజిపి తో కలసి ఆమె సీపి ఇంటికి రావటం ఆతరవాత సిబీఐ అధికారులను పోలీసులు అరష్ట్ చేసి పోలీస్ ఠాణాకు తీసుకెళ్లటం జరిగింది. ఈ చర్య తీవ్ర ప్రశ్నార్ధకం కానుందని అంటున్నారు

సీబీఐ తీరును నిరసిస్తూ ఆదివారం రాత్రి నుండి ఆమె కోల్‌కత్తా లో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఇదిలా ఉంటే శారదా చిట్స్ ఫండ్స్ స్కామ్‌ లో సీపీ ఆధారాలను మార్చారని, సీబీఐ  కోల్‌కత్తా, సీపీపై ఆరోపణలు చేసింది. ఈ విషయంపై సుప్రీం కోర్టులో నిన్ననే అఫిడవిట్ దాఖలు చేసింది. సీబీఐ విచారణకు-కోల్‌కత్తా సీపీ రాజీవ్ కుమార్ హాజరు కావాలని  సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  సీబీఐ విచారణకు సీపీ రాజీవ్ కుమార్  హాజరైతే తప్పేమిటని సి జె ఐ నేత్రుత్వంలోని ముగ్గురు సభ్యుల సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.

కేసు విచారణ ప్రారంభమైన వెంటనే రెండు వర్గాలకు చెందిన న్యాయవాదులు తమ తమ వాదనలను విన్పించారు. కోల్‌కత్తా సీపీని అరెస్ట్ చేయకూడదని కూడ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెంగాల్ ఘటనపై సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు సీబీఐ నివేదికను అందించింది. మమత బెనర్జీ కూడ విచారణకు రావాలని సుప్రీంలో ఏజీ వాదించారు. సుప్రీం కోర్ట్ ఆదేశాలు మమతా బెనర్జీకి తీవ్రమైన షాక్ గానే చెపుతున్నారు. ఈ మద్య ఆమె తొందరపాటు అప్రజాస్వామిక విధానాలు ఆమెను ప్రజల్లో అప్రతిష్ట పాలు చెస్తున్నాయని అనే దానికి దీన్ని ఋజువుగా చెప్పొచ్చని ప్రజాస్వామ్య వాదులు పేర్కొంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: