మారాష్ట్రాల్లోని నేరగాళ్ళపై దాడి జరిగితే ఊరుకోం?: ముఖ్యమంత్రులు మమత, చంద్రబాబుల తీరు

ఒక నగర పోలీస్ కమీషనర్ పై సిబీఐ దాడి చేస్తే,  రాష్ట్ర ముఖ్యమంత్రికి బాధేంటో? అర్ధం కాదు! ఏదైనా అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి మాట్లాడతారు. దేశంలో నేరగాళ్లు రాజకీయ అధినేతల నీడలో దాగి,  చట్టాల నుండి తప్పించుకోవటం మనం చూస్తూనే ఉన్నాం. ఉదాహరణకు సిఎం రమేష్ వందల కోట్ల పన్ను ఎగవేత కేసును, ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి చేసి ఋజువు చేస్తే,  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు  నాయుడు రాష్ట్రంలో  సిబీఐ ప్రవేశాన్ని నిషేధించి నేరగాళ్లను కాపాడేపనిలో పడిపోయారు. దీంతో సుజానా చౌదరి లాంటి వాళ్లు తమ నేరాలకు మసి బూసి మారేడు గాయ చేసేస్తున్నారు. ఇక్కడ మన చంద్రబాబు చెప్పేది రాష్ట్రంపై కేంద్రం దాడి చేస్తుందని. నేరగాళ్ల పై దాడి చేస్తే ప్రభుత్వంపై ప్రజలపై దాడి చేయటం ఎలా అవుతుందో? అర్ధం కాదు. 

ప్రధాని నరేంద్ర మోడీకి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి నువ్వెంత అంటే నువ్వెంత అన్న స్థాయిలో  తీవ్ర పోరు కొనసాగుతున్నదని తెలిసిందే. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ అగ్రనేతల పర్యటనలను మమత దీదీ అడ్డుకోవడం, దానితో ఆమెపై ప్రధాని మోడీ, బిజేపి అధ్యక్షులు అమిత్ షాలు విరుచుకుపడటం సర్వసాధారణంగా మారిపోయింది. అయినా దేశప్రధాని ని రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వపోవటం అంటే చాలా తీవ్రమైన విషయం.  దేశానికి గౌరవప్రదమైన విషయం కూడా కాదు. ఇది గట్టిగా చెప్పాలంటే మమత అంతర్యుద్ధాద్ధానికి సమాయత్తం అవుతున్నారా? చట్టసభలను చట్టుబండలు చేయదలచారా?  

దేశ ఐఖ్యత వద్ధా? ఆమె స్వప్రయోజనాలకు దేశ హితాన్ని ప్రక్కన పెడతారా? పరిష్కారం కాకపోతే న్యాయస్థానం గడప తొక్కొచ్చు అంతా మానేసి వీదుల్లో సమరానికి సిద్ధపడితే ప్రజాస్వామ్యానికి అర్ధమేముంది. ఈ ప్రజాస్వామ్య సమాజంలో రేపు మమత ప్రధాని అవ్వవచ్చు. అప్పుడు ఆమె తీరెలా ఉంటుందన్నది ప్రశ్నార్ధకం. దేశ ప్రధానినికి, దేశ నిఘా వ్యవస్థలకు రాష్ట్రంలో ప్రవేశం నిలుపుదల చెస్తే ఖచ్చితంగా ఆ రాష్ట్రం నేరగాళ్ళ కొమ్ముకాస్తున్నట్లే. 

అయితే ఆ విధానంలోనే ఆదివారం అర్థరాత్రి కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ ను ప్రశ్నించడానికి సీబీఐ ఆయన నివాసానికి వెళ్లడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ విషయం తెలుసుకున్న సిఎం మమతా బెనర్జీ అగ్నిగోళంలా మారిపోయారు.  వెంటనే సీపీ కార్యాలయానికి చేరుకున్న పోలీసులు సీబీఐ అధికారులను అడ్డుకుని, వారిని జీపులో పడేసి, పోలీస్ ఠాణాకు తరలించారు. రాష్ట్ర డీజీపీతో పాటు కమిషనర్‌ కార్యాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాత్రికిరాత్రి ఆమెకు సహజసిద్ధమైన నడిరోడ్డు పై ధర్నాకు దిగారు. దీనికి కారణం ఆమెకు సంబంధం ఉందని చెప్పుకుంటున్న చిట్ గేట్ స్కాం లోని సాక్ష్యాలను తుదకంటా తుడిచెయాలని అనుకోవటం అంటున్నారు. 

పైగా తన పాలనాయంత్రాంగం మీద దాడికి ప్రధాని మోడీ కేంద్ర బలగాలను పంపిస్తున్నారని ఆరోపించారు. సోమవారం జరగాల్సిన శాసనసభ సమావేశాలు తాను కూర్చొన్న నడి రోడ్డుపైనే జరుగుతాయని ఆమె తేల్చిచెప్పారు. పశ్చిమ బెంగాల్‌పై బీజేపీ కత్తికట్టిందని, రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తోందని, విపక్షాల ఐక్యత సభను ఇక్కడ నిర్వహించినందుకే ఇదంతా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఉన్నత స్థాయి అధికారుల్ని వేధించడం ద్వారా రాష్ట్రంలో అలజడి సృష్టించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు.

మరోవైపు మమతా బెనర్జీ దీక్షకు టీడీపీ, సమాజ్‌-వాదీ, ఆర్జేడీ, నేషనల్-కాన్ఫరెన్స్, కాంగ్రెస్, డీఎంకే తదితర విపక్ష నేతలు మద్ధతు ప్రకటించారు. ఇప్పటికే తనవారి నేరాలను కప్పిపుచ్చే క్రమంలో ఇదే విధంగా చంద్రబాబు ముందుకు కదిలే సూచనలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. అంటే దేశవ్యాప్తంగా బిజేపి ఏతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమరాష్ట్రాల్లోని నేరగాళ్ళ పై కేంద్ర నిఘా సంస్థల దాడులను అడ్డుకోవటం దేశ ప్రయోజనాల దృష్ట్యా సమర్ధనీయం కాదని విశ్లేషకుల భావన. అంతకు మించి చెప్పాలంటే వారి రాష్ట్రాల్లో దాగున్న కేంద్రానికి చెందిన నేరగాళ్లను బయటపెడితే మంచిగా ఉంటుంది. దొంగలంతా బయట పడతారు కదా! అలా చేయకుంటే ఖచ్చితంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ సహచరులలోని నేరగాళ్ళకు నిర్వివాదంగా కొమ్ముకాస్తున్నట్లే.   


కోల్‌కతాలో జరుగుతున్న పరిణామాలను ఖండించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు పలు రాష్ట్రాల్లో జరుగుతున్న దాడుల్ని ఆయన తప్పు పట్టారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి అండగా నిలుస్తామన్నారు. కేంద్రం చేపడుతున్న చర్యలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో విపక్షాల ఐక్యతను చూసి ప్రధాని మోదీకి నైరాశ్యం వచ్చిందని ఎద్దేవా చేశారు చంద్రబాబు.వ్యవస్థలను ధ్వంసం చేసేందుకు మోదీ-అమిత్ షా ద్వయం కంకణం కట్టుకుందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


కేంద్రం వ్యవస్థలను తప్పుదోవ పట్టిస్తూ రాజకీయ వ్యతిరేకులను టార్గెట్ చేయడం ఆందోళనకరమన్నారు. కోల్‌కతాలో జరుగుతున్న పరిణామాలు మోడీ-షా ల వ్యవస్థల భ్రష్ఠు పట్టిస్తున్నారు అనడానికి ఉదాహరణ అన్నారు చంద్రబాబు. రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకోవడం సరికాదన్నారు. రాష్ట్రాలను భయపెట్టే చర్యలను మానుకోవాలని హితవు పలికారు. మళ్లీ అధికారంలోకి వస్తామన్న ఆశలు సన్నగిల్లడం వల్లే బీజేపీ ఇటువంటి పనులకు దిగజారుతోందని ఆరోపించారు చంద్రబాబు. లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇలా అశాంతి సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: