బాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై మోహన్‌ బాబు షాకింగ్ కామెంట్స్..?

Chakravarthi Kalyan
ఏపీ ప్రభుత్వం విద్యారంగంపై నిర్లక్ష్యం వహిస్తోందా.. ఈవిషయంపై నటుడు మోహన్ బాబు కామెంట్స్ చూస్తే నిజమేననిపిస్తోంది. చంద్రబాబు సర్కారు కాలేజీలకు చెల్లించవలసిన ఫీజు బకాయిలను సకాలంలో ఇవ్వడంలేదని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన విద్యానికేతన్ పేరుతో విద్యాసంస్థలను నడుపుతున్న సంగతి తెలిసిందే.



ఓ విద్యాసంస్థ అధినేతగా ఆయన తన ఆవేదనను మీడియాతో పంచుకున్నారు. ప్రభుత్వం సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీలు ఆర్ధిక సమస్యలను ఎదుర్కుంటున్నట్లు మోహన్ బాబు చెప్పారు. ఒక్క తమ సంస్థకే రెండేళ్లుగా ఇరవై కోట్ల మేర బకాయిలు రావల్సి ఉందని ఆయన తెలిపారు.



తాము ఆస్తులను తాకట్టు పెట్టి, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని విద్యాసంస్థలు నడుపుతున్నామని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లుగా బకాయిలు ఇవ్వకపోతే ఎంత కష్టమో ఊహించుకోవాలన్నారు. ప్రభుత్వం సకాలంలో ఫీజులు చెల్లించకపోయినా విద్యాప్రమాణాల్లో రాజీ పడటంలేదని ఆయన అన్నారు.



ఇప్పటికైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముందు మోహన్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలు చంద్రబాబు సర్కారును ఇబ్బందుల్లో పడవేసే ప్రమాదం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: