ద గ్రేట్ వాల్ ఆఫ్ ఏపీ.. బాబు సంచలన నిర్ణయం..?

Chakravarthi Kalyan

ఆంధ్రప్రదేశ్.. అనేక సహజ వనరులున్న రాష్ట్రం. ప్రత్యేకించి దేశంలోనే రెండో అతిపెద్ద తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం. గుజరాత్ తర్వాత ఇంత తీరప్రాంతం మరే రాష్ట్రానికీ లేదు. ఇదోరకంగా మైనస్ పాయింట్ కూడా అవుతోంది. తరచూ తుపాన్లు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.



హుద్ హుద్, తిత్లీ, గజ, పెథాయ్.. ఇలా వరుస తుపాన్లు ఏపీని ఇబ్బంది పెడుతున్నాయి. గతంలోనూ దివిసీమ వంటి తుపాన్లు ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో పెను విషాదం నింపాయి. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా.. తుపాన్ల నష్టాన్ని అడ్డుకోలేమా.. ఈ మథనం నుంచి ఏపీ సర్కారు ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.



తుపాను ప్రభావం చాలా తీవ్రంగా ఉండే ప్రాంతాల్లో సముద్ర తీరంలో పొడవైన గోడ నిర్మించాలని ఆలోచిస్తోంది. దాదాపు 970 కిలోమీటర్ల తీర ప్రాంతం ఏపీకి ఉంది. ఇందులో తీవ్రమైన ప్రభావం ఉన్న 150 కిలోమీటర్లపొడవైన గోడ నిర్మించాలని ప్లాన్ చేస్తోంది.



గతంలోనూ ఇలా సముద్ర దూకుడును అడ్డుకునేందుకు చెట్లతో హరిత బంధనం ఏర్పాటు చేయాలని ప్రయత్నించారు. ఈ మేరకు చాలాచోట్ల చెట్లను వరుసగా పెంచారు. కానీ కాలక్రమంలో అవి కొట్టుకుపోయాయి. అందుకే సముద్రానికి అడ్డుగా గోడ కట్టాలని నిర్ణయించామని మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. దీనిపై త్వరలోనే కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: