కర్ణాటక బై పోల్స్ కౌంటింగ్ షురూ..సత్తా చాటుతున్న కాంగ్రెస్!

Edari Rama Krishna

కర్ణాటకలో రెండు శాసనసభ, మూడు లోక్‌సభ స్థానాలకు శనివారం ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే.   బళ్లారి, మాండ్య, శివమొగ్గ లోక్‌సభ స్థానాలు, రామనగర, జమఖండి అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఐదు చోట్లా ప్రతిపక్ష బీజేపీ ఒంటరిగా, అధికార కాంగ్రెస్‌–జేడీఎస్‌లు ఉమ్మడిగా పోటీకి దిగాయి.మొత్తం 31 మంది అభ్యర్థులు బరిలో నిలవగా ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్‌–జేడీఎస్‌ల మధ్యే ఉంది. విజయంపై అన్ని పార్టీలూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి.  తాజాగా కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికల తరువాత ఈ ఉదయం కౌంటింగ్ ప్రారంభమైంది.


తాజా ట్రెండ్స్ ప్రకారం, బీజేపీ ఏ స్థానంలోనూ ప్రభావం చూపడం లేదు. జమ్ఖాండీ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి కులకర్ణి శ్రీకాంత్ సుబ్రావ్ పై కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద్ సిద్ధూ న్యామ్ గౌడ 55,433 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బళ్లారి పార్లమెంట్ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వీఎస్ ఉగ్రప్ప తొలి రౌండ్ లోనే భారీ ఆధిక్యాన్ని చూపిస్తున్నారు.


బీజేపీకి చెందిన జే శాంతాపై 17,480 ఓట్ల ఆధిక్యంలో ఆయన ఉన్నారు. రామ్ నగర్ అసెంబ్లీకి జరుగుతున్న కౌంటింగ్ లో 2వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి ఎల్ చంద్రశేఖర్ కన్నా, జేడీఎస్ అభ్యర్థి అనితా కుమారస్వామి 8,430 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.  మొన్నటి వరకు కర్ణాటకలో బీజేపీ సత్తా చూపిస్తుందని చెబుతూ వచ్చిన అధినేతలు ఇప్పుడు వస్తున్న రిజల్ట్ పై స్పందన లేకుండా ఉన్నారు.  


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: