నోరు తెరిస్తే నీతులు తరచి చూస్తే బ్రతుకంతా బూతులే! వ్యవస్థ బలైనా 'నో ప్రాబ్లం'

చూస్తూ ఉంటే మన రాష్ట్ర అధికార పార్టీ దాని నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వారి మొత్తం మంత్రిమండలికి వాళ్ళ ఆస్తుల్ని సంస్థలని కాపాడు కో వటానికే అధికారంలోకి వచ్చినట్లుంది. అలాగే వేరెవరికి పనులు దొరక్కుండా మొత్తం రాష్ట్రంలోని ప్రభుత్వ కాంట్రాక్టులన్నీ తమ తమ కుటుంబాలకే దక్కాలని, వెరెవరికీ ఆ ప్రయోజనాలు సిద్ధించగూడదన్నట్లుంది వీరి మాటలు చేతలు చూస్తుంటే.

వీరు ప్రజల్లో వాళ్ళు కాదా?
ప్రజల్లో ఒకళ్ళు కాదా?
ప్రజల్లో ఎవరిపైనైనా ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడి చేసినా, సోదాలు చేసినా ఇలాగే స్పందిస్తారా?
ఈ అధికారం వాళ్ళ ఆస్తుల కాపలాకా? కాపాడుకోవటానికా?



ప్రజాస్వామ్యంలో ప్రజలందరికి సమాన హక్కులు భాధ్యతలు విధానాలు ఉన్నందున వాటిని పాలించాల్సిన అవసరం అందరికి సమానంగా ఉంది కదా!  ఒక వేళ ప్రధాని నరేంద్ర మోడీ కక్షతోనే ఐటి దాడులు చేయిస్తున్నాడనుకుందాం - దానికి భాదెందుకు? మన తప్పులు అంటే నేఱాలు అవినీతి తప్పుడు విధానాలైన బందుప్రీతి ఆశ్రిత పక్షపాతం పన్నుల ఎగవేత ఇలాంటివి లేకుండా ఉన్నప్పుడు అనవసరమైన వణుకు భయం కలవరం ఎందుకు?


చంద్రబాబు ప్రతి మీటింగ్ లోను తాను నిప్పని చెపుతారు. అలాంటి వ్యక్తిపై కక్షతో దాడి చేస్తే కాని, చేయిస్తే కాని అవతలవారు ప్రధాని అయినా, మరెవరైనా  మాడి మసై పోరూ? తనే పలు సార్లు నన్ను టచ్ చేస్తే భస్మమై పోతారని అంటుంటారు కదా? అలాంటప్పుడు అసలు ఏ రెగులేటరీ సంస్థ సోదాలు చెస్తే మనకు పోయేదేమీ లేకపోగా మనం ఆణిముత్యాలమని ఋజువౌతుంది కదా! అప్పుడు మన కీర్తి నలుదిశలా వ్యాప్తి చెందితే మన శత్రువుల కీర్తి అదఃపాతాళంలో పడిపోయి వాళ్లు రానున్న ఎన్నికల్లో శంకరగిరి మాన్యాలు పట్టిపోరా? ఈ మాత్రం బాబు & కో కి తెలియదా? 


మరీ అమాయకంగా ఇదేం ప్రశ్న అంటారా? నేఱగాళ్ళు మాత్రమే అలా వణికిపోతారంటారా! అప్పుడు పదే పదే నేను నిప్పును! నన్ను తాకితేనే భస్మీ పటలం అయిపోతారు అనే పురాణకాలంలోని పతివ్రతల మాట లెందుకు? దీన్ని బట్టి ముఖ్యమంత్రితో సహా మంత్రిమండలి మొత్తనికి నిప్పు చల్లారి (అసలు నిప్పైతేకదా!) చెదలు పట్టిందని  అనవచ్చు. మన మనుకొనే నిప్పు క్రింద నిప్పులా కనిపించే ప్రాంతమంతా నిప్పు రంగేసుకున్న బూడిదేనా? తెలుగుదేశం పార్టీ "టాప్ టు బాటం ప్రజాధన దోపిడీ గాళ్ళేనా?"  అదే కదా సిఎం రమెష్, సుజనా చౌదరి, బీద మస్తాన్ రావు, చివరకు అధినేత ఆయన తనయుడే కాదు సర్వం సర్వత్రా అవినీతితో కంపుకొడుతు న్నారు  అనేకాదా ఒక ప్రక్క బిజెపి, ప్రతిపక్షం వైసిపి నిన్నటివరకు కాంగ్రేస్ ఎలుగెత్తి చాటాయికదా!  అదిప్పుడు కేంద్రం కక్ష తో బయట పడుతుంది అదే కదా! వారి వ్యధ, బాధ, వేదన. 


అలాంటప్పుడు కేంద్రాన్ని దుమ్మెత్తిపోయటమెందుకు? ఈ అధర్మాత్రులకు ధర్మ పోరాటాలు, న్యాయ పోరాటాలు అంటూ దొబ్బినతా దొబ్బేసి దోచుకున్నదందంతా దోచేసి, అనుభవించిందంతా అనుభవించి మరోసారి ఎన్నికల్లో గెలవాలే తాపత్రయం, అధికారం నుంచి దూరమైతే బ్రతకటం కష్టం అనే తలపు, వంద తరాలకు సరిపడా వీల్లు దోచిన సంపద పోతే ఎలా? ఈ తాఓత్రయమే కదా! 


ఇప్పుడు ఎవడి కక్షతో అయినా, మరోటైనా వీళ్ళ దోపిదీ వేషాలు జనబాహుళ్యానికి బట్టబయలయ్యాయి? లక్షల కోట్ల రూపాయిల అప్పులు తెచ్చి జనాన్ని ఋణగ్రస్తుల్ని చేసి స్వంత ఆస్తులు పెంచుకునే "పసు సంస్కృతి" ని ఎప్పతికైనా అడ్డగించాల్సిదే! ప్రజలకు వీళ్ళపై ఈషణ్మాత్రం కూడా దయ కనికరం కారుణ్యం అవసరం లేదు. మనం గెలిపించిన వాళ్ళే మన క్షేమం మరచి మన నెత్తిపై కరాళనృత్యం చేస్తుంటే వాళ్ళెలా పోతే ఎవడికి కావాలని నేడు జనబాహుళ్యంలో వినిపించే మాట. ఒకవేళ  నరేంద్ర మోడీ కక్షతోనే ఈ పనులు చెస్తే మీరూ రేపు గెలిచి ఆయన ఆయన బృందంపై అలాగే కక్ష తీర్చుకోండి అప్పుడు ఆయనగారి పాపాల చిఠా కూడా బహిరంగమై వేదిక నెక్కుతుంది. ప్రజలకు కావలసిందేముంది అంతకుమించి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: