పితానిపై జనసేన క్యాండెట్‌ను ఫిక్స్‌ చేసిన పవన్‌...!

VUYYURU SUBHASH
జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి పితాని సత్యనారాయణపై సరైన ప్రత్యర్థిని సెట్‌ చేశారా ? వచ్చే ఎన్నికల్లో మంత్రి పితాని మీద ఆచంటలో జనసేన నుంచి పోటీ చేసేందుకు ఆ పార్టీకి బలమైన అభ్యర్థి దొరికారా ? అంటే జనసేనలో తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి. ఇటీవల ఉభయగోదావరి జిల్లాల్లో జనసేనలోకి పలువురు కీలక నాయకుల‌ జంపింగులు జోరందుకున్నాయి. అధికార టీడీపీ, విపక్ష వైసీపీ నుంచి ఆ పార్టీల్లో దశాబ్దాలుగా చక్రం తిప్పిన వారు సైతం జనసేనలోకి జంప్‌ చేసేస్తున్నారు. తాజాగా ఆచంట నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ... పెనుకొండ మాజీ ఎంపీపీ.. బీసీల్లో బలమైన శెట్టిబలిజ కమ్యూనిటికి చెందిన మల్లుల లక్ష్మీనారాయణ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. 


తెలుగుదేశం ఎంపీపీగా ప్రస్థానం ప్రారంభించి 1999లో పెనుకొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన మల్లుల లక్ష్మీనారాయణ తెలుగు దేశంలో రాష్ట్ర స్థాయిలోనూ పలు కీలక పదవులు నిర్వహించారు. అయితే గత ఎన్నికలకు ముందు పార్టీలో ప్రాధాన్యం లేదని భావించిన మల్లుల వైసీపీలోకి జంప్‌ చేసేశారు. వైసీపీ నుంచి సీటు ఆశించిన ఆయనకు చివరి క్షణంలో ఆ ఛాన్స్‌ దక్కలేదు. సీట్ల సర్దుబాటులో భాగంగా జగన్‌ నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్‌ రాజును ఆచంట నుంచి పోటీకి దింపడంతో లక్ష్మీనారాయణ ఆశలు నెరవేరలేదు. మల్లులతో పాటు ఒకరిద్దరు స్థానిక సమస్థల ప్రజా ప్రతినిధులు సైతం జనసేన తీర్థం పుచ్చుకున్నారు. 


సామాజిక సమీకరణల నేపథ్యంలో ఆచంటలో బీసీల్లో బలమైన శెట్టిబలిజలు ఎక్కువ. ఇక్కడ ప్రధాన పార్టీలు ఈ సామాజికవర్గానికే సీట్లు కేటాయిస్తూ వస్తున్నాయి. అయితే తాజా ఈక్వేషన్లు బట్టీ చూస్తే ఇక్కడ నుంచి అదే సామాజికవర్గానికి చెందిన మంత్రి పితాని సత్యనారాయణ ప్రాధినిత్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయన అక్కడ నుంచే బరిలో ఉండడం ఖాయమే. వైసీపీ నుంచి నియోజకవర్గంలో మైనార్టీలుగా ఉన్న క్షత్రియ‌ కమ్యూనిటీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ రంగనాధరాజు సమన్వయకర్తగా ఉన్నారు. ఇప్పుడు జనసేన సైతం శెట్టిబలిజ‌  సామాజికవర్గానికి చెందిన మల్లుల లక్ష్మీనారాయణను రంగంలోకి దించడంతో ఆచంట రాజకీయం హీట్‌ ఎక్కింది. 


టీడీపీ, జనసేన శెట్టిబలజల నుంచి అభ్యర్థులను రంగంలోకి దించగా వైసీపీ క్షత్రియ వర్గానికి చెందిన వ్యక్తిని పోటీ పెట్టడంతో ఈ ఈక్వేషన్లు ఎలా మారతాయి అన్నది సస్పెన్స్‌గానే ఉంది. ఆచంలో అభ్యర్థుల గెలుపు, ఓటముల‌ను సామాజికవర్గాలే బలంగా ప్రభావితం చేస్తాయి. అదే టైమ్‌లో నియోజకవర్గంలో కాపుల ఓట్లు కూడా ఎక్కువే. మరి ఈ టైమ్‌లో పవన్‌ కళ్యాణ్‌ ఇక్కడ వ్యూహాత్మకంగానే మల్లుల లక్ష్మీనారాయణ అభ్యర్థిత్వాన్ని ఖ‌రారు చెయ్యనున్నారని తెలిసింది. తూర్పుగోదావరి జిల్లాలో ముమ్మడివరంలో పవన్‌ కాపు ప్లస్‌ శెట్టిబలిజ కాంబినేషన్‌తో శెట్టిబలిజ క‌మ్యూనిటీకి చెందిన  అభ్యర్థిని ఎలా ఎంపిక చేశారో ఆచంటలోనూ అదే సూత్రాన్ని ఫాలో అవుతూ లక్ష్మీనారాయణ అభ్యర్థిత్వాన్ని వ్యూహాత్మకంగా గెలిచే ప్లాన్‌తో ముందుకు వెళుతున్నార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: