గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న రేవంత్ వ్యవహారం! అయినా నేర్పరితనం వెళ్ళబెడుతున్న బాబు!

రేవంత్ రెడ్డి నేడు తెలంగాణలో ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నేత. కాంగ్రెస్ లో అతి స్వల్ప కాలంలోనే కాలంలోనే ఈ స్థాయికి చేరారు. ఈయన రాజకీయ జీవితానికి పునాదులు పడింది తెలుగుదేశం పార్టీ లోనే. మంచి నేతగా ఎదిగిందీ తెలుగుదేశంలోనే. ఆయన రాజకీయ జీవితం సర్వనాశనం అయ్యింది తెలుగుదేశం లోనే. రాజకీయ జన్మ అంతా సాఫీగా జరిగింది చంద్రబాబు నాయుడు ఆడే రాజకీయ జూదంలో బలి కావటానికే అన్నట్లు, "ఓటుకు నోటు కేసు" లో ధారుణంగా ఇరుక్కోవడం, ప్రతిష్ఠ మసకబారటం, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభ సన్నగిల్లటం చకా చకా జరిగిపొయ్యాయి. చివరగా తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ పై సరిసమానంగా మాటల దాడి చేయ్యటం నిజంగా చెప్పాలంటే బూతుల దాడి చెయ్యటంలో సమ ఉజ్జి అనిపించుకున్నాడు. తెలంగాణాలో కెసిఆర్ నాయకత్వాన్ని ఢీ కొనగల సత్తా ఉన్న నేతగా గుర్తించబడ్డాదు కూడా!


ఈ సమయంలోనే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు లో జైలుకు వెళ్లాడు. ఆతరవాత కాంగ్రెస్ అధినేత దృష్టిలో పడి కాంగ్రెసును తెలంగాలో కెసిఆర్ ను ఎదిరించి అధికార తీరాలకు చేర్చగల హీరోగా గుర్తించబడి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడుగా పదవి భాధ్యతలు కట్టబెట్టబడ్డాయి. 


బలిచ్చే ముందు మేకకు చేసే అలంకరణ లాగా అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం అధినేత ఫుల్లుగా అందలానికి ఎక్కించేశారు. ఈ తరుణం లో వ్యూహాత్మకం గానో యాదృచ్చికం గానో ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది  ఆయన ఆయన పరిపారంపై. ఇలాంటి నేపథ్యంలో, ఇప్పుడు రేవంత్ చుట్టూ తీవ్రమైన కేసులు ముసురు కొంటున్నాయి. భారీగా అక్రమాస్తులు బయటబడ్డాయనే మాట వినిపిస్తోంది.


విదేశాల్లో అక్రమాస్తులు దాచాడని. సింగపూర్లో భారీగా అక్రమాస్తులున్నాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి రేవంత్ ఆర్థిక వ్యవహారాల్లో ఆయన అరెస్టు కావొచ్చ నే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. రానున్న వారం పది రోజుల్లోపు రేవంత్ రెడ్డి అరెస్టు జరిగినా జరగొచ్చు అంటున్నారు. అయితే రేవంత్ వ్యవహారంలో చంద్రబాబు కు ప్రమేయం ఉంటుందా? అనేది మాత్రం ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే.

రేవంత్ రెడ్డి వ్యవహారంలో ముఖ్యంగా ఓటుకు నోటు కేసు ద్వారా సాగే బలమైన తీగ చంద్రబాబునే బయటకు లాగేస్తుందని, ఆయన కూడా ఇరుక్కొనే ప్రమాదముందనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. అందులో ముఖ్యమైనది ప్రధానమైనదీ ప్రజలంతా నెలలతరబడి టెలివిజన్ల ముందు కూర్చొని సినిమాలా చూసిన  "ఓటుకు నోటు కేసు" . ఈ కేసులో ఈడీ విచారణ జరిగితే, అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రమేయం గురించి కూడా విచారణ జరాగాల్సిఉంటుందని అంటున్నారు.


ఓటుకు నోటు కేసుతోనే చంద్రబాబు తన ప్రభుత్వాన్ని, రాజకీయ,  అర్ధిక పరివారాన్ని నెత్తినెట్టుకొని, హైదరాబాద్ నుండి, రాత్రికిరాత్రే, పేరూ ఊరులేని అమరావతికి ఉడాయించి ఏపికి లక్ష కోట్ల రూపాయల రాష్ట్ర విభజన ప్రయోజనమైన ఉమ్మడి రాజధాని అవకాశాన్ని తన స్వంత ప్రయోజనానికి తగలెట్టాడని అంటారు. దీంతో చంద్రబాబు నాయుడు తెలంగాణ వ్యవహారంలో చేతులెత్తేశాడు. ఇక్కడ తమ పార్టీ ఏమై పోయినా తనకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు బాబు. 

తెలంగాణ వ్యవహారంలో ఎక్కడ చేయి పెడితే, తనను ఓటుకు నోటు కేసు తగులు కుంటుందేమో మూసేస్తారేమో అని చంద్రబాబు మొదటి నుంచి భయపడుతున్నాడు. అందుకే తెలంగాణలో ప్రచారానికి కూడా రాను అని తేల్చేశాడు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు తన భయాందోళనను చాటేశాడు. అయినప్పటికీ కూడా, ఓటుకు నోటు కేసు ఇప్పటికీ చంద్రబాబు గుండెల్లో రైళ్లను పరిగెట్టిస్తోంది, నిను వీడని నీడను నేను అంటూ! అయితే ఈ మద్య ఈడి ఐటి శాఖల అధికారులు ఒక్కసారిగా రామారావు అనే న్యాయవాది పిర్యాదుపై స్పందించినట్లుగా - రేవంత్ రెడ్డి ఆయన అనుయాయులపై ఉక్కిరి బిక్కిరి చేసే దాడులు నిర్వహించిన కథ అందరికి తెలిసిందే.

అయితే ఈ రెండు సంస్థలు గత రెండేళ్లుగా రెవంత్ రెడ్ది వ్యవహారాలపై నిఘా పెట్టినట్లు ఆయనతో సంబంధ బాంధవ్యాలు నెరిపిన వారందరి జాతకాలు ఔపాసన పట్టినట్లు సమాచారం. అటు చంద్రబాబు తో ఇటు కాంగ్రెస్ నేతలతో ఉన్న వ్యవహారాలన్నీ ఆ రెండు నిఘా సంస్థలకు బాగా తెలుసుననే సమాచారం వారి గుండెల్లో విమానాలు పరుగెత్తిస్తుందని అంటున్నారు. అందుకే ఎవరికి వారు గుమ్మడికాయల దొంగల్లా భుజాలు తడుముకుంటూ బ్రతుకులీడుస్తున్నారు. 

అమరావతిలో ఈ పరిణామంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చాలా ఆలస్యంగా అదీ పరోక్షంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్పందించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెద్ద దొంగలను పట్టుకోదని, అధికారాన్ని రాజకీయాలకు ఉపయోగిస్తోందని మండిపడ్డారు. ఒక్క రేవంత్ అంశం అనే కాదని, ఎన్నికలొచ్చే ప్రతి చోటా కేంద్రం ఇదే తరహా రాజకీయం చేస్తోందన్నారు. రాజకీయ పార్టీలకు ఒక పద్ధతి ఉండాలన్న బాబు, కేంద్రం ఇంత నీచ రాజకీయాలకు దిగడం దారుణమన్నారు. తమిళనాడులో ఏం జరిగిందో ఇతర రాష్ట్రాల్లో ఏం జరుగుతోందో ప్రజలు గమనిస్తున్నా రని బాబు అన్నారు. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లోనే కేంద్రం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు

సీఎం, రేవంత్ రెడ్డి నివాసంలో ఐటీ సోదాలపై  నాలుగేళ్లుగా బీజేపీ విధానాలు చూస్తున్నామని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని, వ్యక్తులు, పార్టీలకు హుందాతనంగా ఉండాలన్నారు.  ఈ విధంగా గురివిందకు తన క్రింద నలుపు తెలియదా? అహా!  చంద్రబాబు బహు నేర్పరివి బ్రదర్! 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: