వారంట్ కే ఇంత సీనా? నటుడు శివాజికి మానసిక సమస్యలున్నాయా?

"ఆపరేషన్‌ గరుడ ఆపరేషన్‌ ద్రవిడ" అంటూ ఇటీవల ప్రజలలో కల్లోలం సృష్టించే వ్యాఖ్యలు చేసిన సినీనటుడు శొంఠినేని శివాజీ, మరల తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకుకు "నాన్‌-బెయిలబుల్‌-వారెంట్‌-ఎన్ బి డబ్ల్యూ" నోటీసులు జారీ అయిన నేపథ్యంలో మరోసారి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 

"చంద్రబాబుకు కోర్టు నోటీసులు రావడం అన్యాయం.
నోటీసులకు భయపడి మహారాష్ట్ర వెళ్తే మిమ్మల్ని ఉచ్చులో దింపుతారు.
న్యాయ నిపుణులను సంప్రదించండి.
చంద్రబాబు మీద భారీ కుట్ర జరుగుతోంది.
ఇది అమానుషం.
త్వరలో చంద్రబాబుకు మరో రెండు, మూడు నోటీసులు వస్తాయి.
రెండో నోటీసు సిద్ధంగా ఉంది.



మోదీకి ఎవరైనా ఎదురు మాట్లాడుతున్నారంటే అది చంద్రబాబే.
ఐరాసలో చంద్రబాబుకు మాట్లాడే అవకాశం వచ్చింది.
రాష్ట్రానికి రావాల్సిన "ఆపిల్‌ సంస్థ"  రాకుండా భాజపా అడ్డుకుంది.
రాష్ట్రానికి రాజధాని లేదు. ఉపాధిలేదు. పరిశ్రమలు లేవు.
పోలవరం మధ్యలో ఉంది.
కియా మోటార్స్‌ ప్రారంభం కావాల్సి ఉంది.



ఇలాంటి పరిస్థితుల్లో కుట్రలు అవసరమా?
ఈ సమయంలో రాజకీయ సంక్షోభం వస్తే రాష్ట్రం నిలువునా మునిగిపోతుంది. మోదీ 30 శాతం ఓట్లతో ప్రధాని అయ్యారు.
నేను చెప్పేది తప్పా? ఒప్పా? అనేది ఆలోచించండి.
నేను నిజాయితీగా రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నా.
మీరంతా రాజకీయం కోసం ఆరాట పడుతున్నారు.
రాజకీయ పార్టీలన్నీ రాజకీయ వ్యాపారం చేస్తున్నాయి.
నాకు ఎలాంటి రాజకీయాలు అవసరం లేదు.
నేను నాటకాలు ఆడుతున్నానని వైకాపా నాయకులు(?) అంటున్నారు.
మీ నాయకుడు చేసేదేమిటి? చాలా మందికి జగన్‌ ఎవరో తెలియదు" అని శివాజీ విమర్శించారు.

ఇది  ఒక ప్రముఖాతిప్రముఖ తెలుగు పత్రిక ఆన్లైనులో ప్రచురితమైన వార్త.  ఎన్.బి.డబ్ల్యూ చంద్రబాబుకు జారీ ఐతే కష్టం గాని నష్టంగాని ఏమిటి? అది జాతికి కష్టమా? వాయిదాలకు  హాజరుకాకున్నా స్పందించకున్నా వచ్చేది ఎన్.బి.డబ్ల్యూ నే. అది సామాన్యుడైనా అనన్య సామాన్యుడైనా చట్టప్రకారం న్యాయస్థానాల్లో జరిగేది వ్యవహారం కూడా అదే. 

*అసలు న్యాయస్థానంలో 22 సార్లు వాయిదాకు ఒక సాధారణ పౌరుడు హాజరవలేదంటే నేరం. అదే ఒక సాధారణ పౌరుణ్ణి వదిలేస్తారా? కాని ఒక శాసనసభ్యుడై ఉండీ, ఒక దశాబ్ధంపైగా ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తి అలా చేస్తే దాన్ని నేరమే కాదు దుర్మార్గం అనాలి. ఎందుకంటే శాసనం చేసిన వ్యక్తే శాసనధిక్కారం చేస్తే కంచే చేను మేసినట్లు కదా!  దీంట్లో అన్యాయమేముంది? 2010 కేసు ఇప్పుడు ఎనిమిదేళ్ళ తరవాత ఎన్.బి.డబ్ల్యూ విడుదల అవ్వటం లో కేంద్రం పాత్రేముంది. ఇలాంటి సంఘటనలు చట్టం ముందు నిలుస్థాయా? 

*చట్టాన్ని ధిక్కరించటమేకాదు దానికి ప్రోత్సహించటం కూడా నేరమే నని భారత శిక్షాస్మృతి చెపుతుంది. బాబు ను ఎన్.బి.డబ్ల్యూ కు స్పందించి న్యాయస్థానానికి వెళ్ళవద్దనటం ద్వారా శొంఠినేని శివాజి కూడా నేరస్తుడే. అప్పుడు ఆయన శిక్షార్హుడు కూడా? న్యాయస్థానంలో విడుదలవనున్న వారంట్ల విషయాలు ముందే "న్యాయస్థానేతర వ్యక్తి" అసలు ఏమీ లేని శూన్యంలో చేపలు పట్టటానికి శివాజి ప్రయత్నిస్తుంటే - ఇది పిచ్చివాని ప్రేలాపన కాదా!  అందుకే ఈ నేపధ్యంపై విచారణ జరపటం ప్రభుత్వాలకు శాంతి భద్రతల సమస్యలు లేకుండా ముందే పూనుకోవటం మంచిది. 

*ఇంకా రెండు మూడు నోటీసులు రానున్నవని చెప్పటంపై కూడా విచారణ జరగాలి. న్యాయస్థానంలో విచారణ విధానంలో భాగం మాత్రమే ఈ వారంట్లు. అందుకే ఇంత అలజడికి కారమైన శొంటినేని శివాజికి ఏమైనా మానసిక సమస్యలున్నాయా? అనే దానిపై వైద్య ఆరోగ్య పరీక్షలు జరిపితే మంచిది. ఆయన మాటలకు ప్రకటనలకు ప్రచారమిచ్చే వార్తా సంస్థలు కూడా ప్రాధమికంగా స్టడీ చేసిన తరవాతే వార్తలు ప్రచురిస్తే మంచిది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: