మన ప్రక్క రాష్ట్రంలో "ఆరోగ్య మంత్రి - డిజిపి" నేరగాళ్ళని ఋజువైతే...?


సాధారణంగా రాజకీయ నాయకుల్లో నేరగాళ్ళు మిళితమై ఉండటం మనదేశంలో సహజం. చివరకు మంత్రులు ఉన్నతాధికారులు కూడా నేడు నెఱాలు చేస్తూ పచ్చిదగా కోర్లుగా మారటం వింటూనే ఉన్నాం. తాజగా తమిళనాడులో రాష్ట్ర ఆరోగ్య మంత్రి సి.విజయ భాస్కర్‌, సహా పలువురు ఉన్నత స్థాయి అధికారులకు కోట్లాది  రూపాయిల గుట్కా కుంభకోణంతో సంబంధం ఉందనే అనుమానంతో  డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ టీకే రాజేంద్రన్‌ సహా మరికొందరు ఉన్నత స్థాయి అధికారుల ఇళ్లలో సీబీఐ సోదాలు నిర్వహించింది.

తమిళనాడు రాష్ట్రంలో గుట్కా తదితర నమిలే పొగాకు ఉత్పత్తులను నిషేధం ఉన్నప్పటికి వాటి అమ్మకాలు కొనసాగుతుండటంపై ఈ ఏడాది ఏప్రిల్‌లో మద్రాస్‌ హైకోర్టు ఈ అంశంపై విచారణ జరపాల్సిందిగా 'సీబీఐ' ని ఆదేశించింది. గతంలో ఆదాయపన్ను శాఖ అధికారులు ఒక వ్యాపారికి సంబంధించిన ఆస్తులపై దాడులు చేయగా వారికి లభించిన డైరీ లో లంచాలు ఇచ్చిన వారి జాబితా లో పలువురు రాజకీయ నాయకులు, సీనియర్‌ పోలీసు ఉన్నతాధికారుల పేర్లు ఉన్నాయి. దీంతో హైకోర్టు ఈ కేసును ఇటీవల సీబీఐ కి అప్పగించింది. ఇప్పుడు సీబీఐ ఆ దిశగా విచారణ ప్రారంభించింది.

బ్లాక్‌-మార్కెట్‌ లో నిషేధిత వస్తువుల అమ్మకాలు జరుగుతున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. మాజీ పోలీసు కమిషనర్‌ ఎస్‌.జార్జి, ఆహార భద్రత విభాగం, సేల్స్‌ ట్యాక్స్‌ విభాగం అధికారుల ఇళ్లతో కలిపి మొత్తం 40 చోట్ల దాడులు చేసి సోదాలు జరిపినట్లు తెలిపారు. 



తమిళనాడు వ్యాప్తంగా సీబీఐ దాడులు 50 మంది సీబీఐ అధికారులు పాల్గొన్నారు. 40 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. గుట్కా స్కాం కేసులో ఆరోగ్యశాఖ మంత్రి విజయ భాస్కర్‌, డీజీపీ రాజేంద్రన్‌కు భారీగా ముడుపులు అందాయని ఆరోపణలు ఉన్నాయి.2016 లో ఆదాయపన్ను అధికారులకు మాధవ రావు అనే వ్యాపారి కార్యాలయంలో ఆ డైరీ దొరికింది. అందులో పలువురు రాజకీయ నాయకులు, పోలీసు అధికారులకు రూ.40కోట్ల దాకా లంచాలు ఇచ్చినట్లు ఉంది.


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: