ఆ బీచ్ లో జెల్లీఫిష్‌ కలకలం!

Edari Rama Krishna
నీటిలో పారదర్శకంగా కనిపిస్తూ.. తళతళా మెరిసే జెల్లీ చేపలు చూస్తే ఇప్పుడు ముంబై నగర వాసులు భయపడుతున్నారు.  ముంబై బీచ్‌లో గత కొన్ని రోజులుగా జెల్లీఫిష్‌లు కలకలం రేపుతున్నాయి.  విషపూరిత ‘బాటిల్‌ జెల్లీఫిష్‌లు’ సంచరిస్తుండటంతో  అటు వైపు వెళ్లాలంటే జనాలు భయపడిపోతున్నారు.  ఇప్పటికే వీటి దాడిలో దాదాపు 150 మంది గాయపడినట్లు సామాచారం.  అయితే గాయాలు అయిన చోట నిమ్మకాయలు రాస్తున్నా పెద్దగా ఉపశమనం లేదని..విపరీతమైన మంట..నొప్పి అంటున్నారు అక్కడి ప్రజలు. 

ఇక బ్లూ బాటిల్‌ జెల్లీఫిష్‌ విషపూరితమైనవి కావటంతో వాటికి రాకాసి జెల్లీఫిష్‌లుగా పేరుపడిపోయింది.  ఇదిలా ఉంటే..జెల్లీఫిష్‌ విషపూరితమైనవే కానీ మనుషులకు హాని చేసేంత విషం వాటిలో ఉండదని..కేవలం చాపలు చంపడానికి మాత్రమే దాని విషయం పనిచేస్తుందని..ఈ విషయంలో అపోహలు వద్దు అని అంటున్నారు.

కాకపోతే విపరీతమైన నొప్పి కొద్ది గంటలపాటు ఉంటుంది. ప్రతీ ఏటా అవి బీచ్‌లో సంచరిస్తుంటాయి. ఈ దఫా భారీ సంఖ్యలో అవి వచ్చి చేరాయి. అయినప్పటికీ ఆ చుట్టుపక్కలకు వెళ్లకపోతే మంచిది అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: