వైసీపీ ఆ విషయం లో ఇంకా వెనుకనే ఉందా..!

Prathap Kaluva

వైసీపీకీ  రాయలసీమ కంచు కోట లాంటిది. ఒక్క అనంత పురం లో తప్ప మిగతా అన్ని జిల్లాల లో వైసీపీ ప్రాభల్యం ఉందని చెప్పొచ్చు. 2014 ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను వైసీపీ స్వంతం చేసుకున్నది. అయితే తరువాత కొంత మంది ఎమ్మెల్యేలు టీడీపీ లోకి జంప్ అయ్యారు. ఇప్పడూ వైసిపీ కి బలమైన నాయకులూ కరువైనారు. అయితే  ఇలా నేతలు వెళ్లిన నియోజకవర్గాల్లో వైసీపీ చాలా త్వరగానే కోలుగోగలిగింది. వారు వెళ్లిన చోట చాలా త్వరగా ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసుకుంది. కొన్ని నియోజకవర్గాల విషయంలో అలా చాకచక్యంగా వ్యవహరించారు కానీ.. మరికొన్ని చోట్ల మాత్రం వైసీపీకి ఇప్పటికీ సరైన ఇన్‌చార్జిలు లేరు.


గత ఎన్నికల్లో ఓడిన కొన్ని నియోజకవర్గాల్లో పత్యామ్నాయాలను సిద్ధం చేసుకోవడంలో వైసీపీ ఇప్పటికీ రెడీ కాకపోవడం విశేషం. అనంతపురం జిల్లాలో ఇలాంటి ఇన్‌చార్జిల లోటు స్పష్టంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన రాయదుర్గం, మడకశిర, పెనుకొండ, కల్యాణదుర్గం నియోజకవర్గాల్లో వైసీపీ అంత యాక్టివ్‌గా కనిపించడంలేదు ఇప్పటివరకూ. పేరుకైతే ఇక్కడ ఇన్‌చార్జిలు ఉన్నారు కానీ.. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను ఢీకొట్టి నిలవగలరా వీళ్లు? అంటే మాత్రం సందేహమే.


టీడీపీ సిట్టింగులున్న ఇతర నియోజకవర్గాల్లో కొంతమంది ఇన్‌చార్జిలు బాగా కష్టపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుస్తారో, ఓడతారో కానీ.. ఇప్పటి నుంచినే గట్టిపోటీ అయితే ఇస్తున్నారు. అయితే పై నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం వైసీపీ నామమాత్రంగా మిగిలింది. ఈ నియోజకవర్గాల్లో గతంలో కాంగ్రెస్‌ గెలిచింది. కాబట్టి ఇవేమీ తెలుగుదేశం పార్టీకి కంచుకోటలు కూడా కావు. సరైన అభ్యర్థులు బరిలోకి దిగితే వైసీపీకి మంచి అవకాశాలే ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: