ఎడిటోరియల్ : నాడు ఇందిర వర్సెస్ ఆల్-నేడు మోడీ వర్సెస్ ఆల్-ప్రధాని పదవికోసం ఆరాటం

బాజపా-మోదీపై పోరాటం అంటే హిందూ సమాజంపై ధారుణమైన ప్రత్యక్ష పోరాటం అన్నట్లే. హిందువుల్లోను లౌకికవాదులూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మమత, మాయ, అఖిలేష్, బాబు, లాలు లాంటి వాళ్ళు హిందువులపట్ల ప్రదర్శించే తీరుచూసి, లౌకికవాదులు కూడా తీవ్రంగా స్పందించే అవకాశం ముమ్మరమౌతుంది.    ఎన్నిక ల ప్రస్థావన ఏమాత్రం లేకపోతే పైవ్యక్తులు లౌకికవాదంలాంటి మాటలువాడే ప్రసక్తి ఉండేదికాదు. ఎన్నికలకోసం ఈ అవకాశవాదుల, అసహనవాదుల వైఖరిని హిందువులు క్షమించరు. 


2019 సంవత్సరం జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏను ఓడించేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం ప్రధాన మంత్రి పదవిని సైతం వదులు కునేందుకు సిద్ధపడింది.


బాజపా పట్ల దానిపై కక్ష తీర్చుకోవటానికి కాంగ్రెస్ ప్రదర్శించే అసహన స్థాయి తనను తాను ఇతరపార్టీల పాదాల చెంత పడి ఉండటానికి సైతం దిగజారింది దానికి ఉదాహరణ కర్ణాటకీయమే. అదే వైఖరిని   లోక్‌సభ ఎన్నికల్లో యుపీఏ మిత్రపక్షాలు, ఇతర ప్రతిపక్షాలకు మెజారిటీ లభించే పక్షంలో బీజేపీ-ఆరెసెస్  యేతర నాయకుడి ని ప్రధాన మంత్రిగా నియమించేందుకు తమ అధినాయకత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెబుతున్నారు. అధికారం కోసం ఇతర పార్టీ పాదాలను పట్టు కోవటానికి సిద్ధపడే కాంగ్రెస్ రేపు దేశాన్నివిదేశాలకు తాకట్టు పెట్టదు అనే గ్యారంటీ లేనేలేదు.


రాజీవ్ గాంధిని పెళ్ళి చేసుకోవటంతో ఇటలీ వనిత సోనియా గాంధి కాంగ్రెస్ అధినేత కాగలిగింది. ఆమెను కాంగ్రెస్ ప్రజల నెత్తిన రుద్దింది. అలాగే ఇప్పుడు ఆమె తనయుడు రాహుల్ గాంధిని కూడా. ఆయనకు కూడా విదేశీ పౌరసత్వమే ఉందని బాజపా నేత సుబ్రమణ్యస్వామి నొక్కి వక్కాణిస్తున్నారు. అందుకే ఆయన నేత్రుత్వంలోని కాంగ్రెస్ దేశం పట్ల బాధ్యత లేకపోవటం చేతే స్కాముల పల్లవిలో తన రాజకీయ గీతాన్ని ఆలపిస్తుంది. కర్ణాటకలో ప్రజలు తన కిచ్చిన మెజారిటీని అధికారాన్ని జెడిఎస్ కాళ్ళ చెంత పడేయటం - తన ఉనికిని తనకు ప్రజలిచ్చిన విజయాన్ని ఖాతర్ చేయకపోవటమే. అలాగే ఈ విదేశం నుంచి దిగుమతైన ఈ పార్టీ నాయకత్వం మరోదేశం కాళ్ల చెంత ఈ దేశ సార్వభౌమత్వాన్ని ఉంచదన్న గ్యారెంటీ ఉందా? అనుమానమే.    


చంద్రబాబు ఎన్నికల కోసం హిందూధర్మానికి తిలోదకాలివ్వగలరనేది తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో చేసిన నిర్వాకాలతో ఋజువైన అంశం.  అలాగే బంగ్లాదేశ్ నుండి ఎన్నికలలో గెలుపుకోసం ఆ దేశీయులను దిగుమతి చేసుకొని వారికి అన్నీ దృవపత్రాలను ఆధార్ కార్డ్ తో సహా సమర్పించే మమతా బెనెర్జీ తీరుకూడా దేశం పట్ల హిందూ జాతి పట్ల ఆమె స్వరూపం అర్ధం అవుతూనే ఉంది. ప్రధానిపదవి కోసం వెంపర్లాడే వీరి తీరు క్షమించరానిదే.


లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని యుపీఏ మిత్రపక్షాలు ఏకైక పెద్దపార్టీగా అవతరిస్తే తాను ప్రధాన మంత్రి పదవి చేపడతానని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్నాటక శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రకటించటం తెలిసిందే. ఈ ప్రకటనతో ప్రతిపక్షాలు ఒక తాటిపైకి రావటం కష్టంగా మారింది.


రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవి చేపట్టే పక్షంలో కాంగ్రెస్‌కు తామెందుకు మద్దతు ఇవ్వాలని టీఎంసీ, బీఎస్పీ, ఎస్పీ తదితరపార్టీల అధినాయకులు ప్రశ్నిస్తున్నారు. రాహుల్ నాయకత్వంలో పనిచేసే ప్రసక్తేలేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇదివరకే ప్రకటించారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, ఎస్పీ అధ్యక్షు డు అఖిలేష్ యాదవ్ కూడా ఇలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారని తెలిసింది.


నరేంద్ర మోదీని ఓడించాలంటే అన్ని ప్రతిపక్షాలు కలిసికట్టుగా పోటీ చేయాల్సిందే అన్నది మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేష్ యాదవ్ వాదన. అయితే రాహుల్ ఇప్పటినుండే ప్రధాన మంత్రి పదవికోసం పోటీ పడితే కలిసి పనిచేయటం, సీట్ల సర్దుబాటు చేసుకోవటం కష్టమని వారు కాంగ్రెస్ సీనియర్ నాయకులతో చెప్పినట్లు తెలిసింది. అనంతరం కాంగ్రెస్ అధినాయకత్వం పార్టీ సీనియర్ నాయకులతో కీలక సమావేశం జరిపి పరిస్థితిని సమీక్షించింది.


ప్రధాన మంత్రి పదవికోసం ఇప్పటి నుండే పోటీ పడటం, ప్రతిపక్షంలో చీలికలు రావటం మంచిది కాదని పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అభిప్రాయపడినట్లు తెలిసింది. ప్రతిపక్షం చీలిపోతే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి మెజారిటీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నదని వారంటున్నారు. ఈ నేపథ్యం లో ఇప్పటి నుండే ప్రధాన మంత్రి పదవికోసం పోటీ పడే బదులు ఎన్నికల ఫలితాల ఆధారంగా అప్పుడే ఈ అంశంపై ఒక నిర్ణయానికి రావటం మంచిదని పలువురు సీనియర్ నాయకులు అధినాయ కత్వానికి సూచించినట్లు చెబుతున్నారు.


ప్రధాన మంత్రి పదవికి పోటీ పడుతున్న నేపథ్యంలో తమకు ఆశించినన్ని సీట్లు రానిపక్షంలో కాంగ్రెస్ పరువు, ప్రతిష్ట మరింత దిగజారుతుంది కాబట్టి లోక్‌సభ ఎన్నికల ఫలితాల ఆధారంగా ప్రధాన మంత్రి ఎవరనేది నిర్ణయించటం మంచిదని వారంటున్నారు.


కాంగ్రెస్ ఏకైక పెద్దపార్టీగా అవతరించే పక్షంలో ఇతర ప్రతిపక్షాలు తమకే మద్దతు ఇవ్వవచ్చు, ఇలా కాకుండా కాంగ్రెస్‌కు తక్కువ సీట్లు వచ్చి ఇతర ప్రతిపక్షాలకు ఎక్కువ సీట్లు వచ్చే పక్షంలో భాగస్వామ్య పార్టీలు పరస్పరం చర్చలద్వారా ప్రధానమంత్రిని ఎన్నుకోవటం మంచిదనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.


నరేంద్ర మోదీని ఓడించడమే ప్రధాన లక్ష్యం కాబట్టే అందరి శక్తియుక్తులు ఆ విషయంపైనే కేంద్రీకరించాలి తప్ప ప్రధాన మంత్రి ఎవరు అనే అంశంపై చర్చ జరపటం కాదని పరువురు నాయకులు అంటున్నారు.


మమతా బెనర్జీ, మాయావతి కూడా ప్రధాన మంత్రి పదవిపై దృష్టి కేంద్రీకరించినందున ఇప్పుడిప్పుడే ఈ పదవి ఎవరికి దక్కాలనే అంశంపై చర్చ జరపటం మంచిది కాదని కొందరు కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల మధ్య సమైక్యత సాధించాలంటే రాహుల్ గాంధీ ప్రస్తుతానికి ప్రధాన మంత్రి రేస్ నుండి తప్పు కోవాలనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది.


కాంగ్రెస్ అధినాయకత్వం సీనియర్ల సమావేశంలో అన్ని అంశాలను లోతుగా సమీక్షించిన తరువాతనే నాన్-బీజేపీ, నాన్-ఆర్‌ఎస్‌ఎస్ అభ్యర్థిని ప్రధాన మంత్రిగా ఎంపిక చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కాంగ్రెస్ ఇప్పుడు అంటోంది.


ఈ సంవత్సరాంతంలో జరుగనున్న మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరాం శాసనసభ ఎన్ని కల్లో ప్రతిపక్షాలు కలిసికట్టుగా పోటీచేసి బీజేపీని ఓడించాలన్నది మాయావతి, అఖిలేష్ యదవ్ వాదన. అయితే కాంగ్రెస్ మాత్రం మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రతిపక్షాలతో సీట్ల సర్దుబాటుకు సిద్ధపడిన కాంగ్రెస్, రాజస్థాన్‌లో మాత్రం ఒంటరిగా పోటీ చేస్తామని చెబుతోంది. దీనికి మాయావతి అంగీకరించటం లేదు. రాజస్థాన్‌లోనూ ప్రతిపక్షాలు సీట్ల సర్దుబాటు చేసుకోవాలి, లేనిపక్షంలో లోక్‌సభ ఎన్నికల్లో కూడా సర్దుబాటు సాధ్యం కాదని మాయావతి వాదిస్తున్నారు. మూడు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు సీట్ల సర్దుబాటు చేసుకునే అంశం ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వచ్చే సూచన లు కనిపించటం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: