జనసేనలోకి "అక్కినేని అమల"...? నాగ్ తో " మెగా మంతనాలు"

Bhavannarayana Nch

రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఒక్కో ఆసక్తికరమైన విషయం బయట పడుతోంది..గత ఎన్నికల కంటే కూడా ఈ ఎన్నికలు వైసీపీ ,తెలుగుదేశం పార్టీలకి చావో రేవో అనేట్టుగా ఉంటే జనసేన మాత్రం పూర్తిస్థాయిలో పార్టీ నిర్మాణం జరుగక పోయినా సరే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవిషయంలో కింగ్ మేకర్ అవుతుందని అంటున్నారు..అయితే ఇప్పుడిప్పుడే జనసేన పార్టీ లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి...అయితే పార్టీలో పవన్ కళ్యాణ్ ఒక్కడే కనిపించడం తప్ప పార్టీలో కీలక మైన వ్యక్తులు కానీ వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్ధి పార్టీలని సైతం చిత్తుగా ఓడించగలిగే అభ్యర్ధులు గానీ జనసేనలో లేకపోవడం పార్టీ కి పవన్ కి తీవ్రమైన నష్టాన్ని తీసుకు వచ్చేలా ఉన్న తరుణంలో

 

 జనసేనలోకి చిరంజీవి అభిమాన సంఘాలు వచ్చి చేరడం జనసేన పార్టీకి మంరింత బలాన్ని తెచ్చి పెట్టింది.. అంతేకాదు చిరంజీవి నాగబాబు లు మూతం మెగా ఫ్యామిలీ అంతా పవన్ కి తోడుగా నిలవబోతున్నాయి..అయితే ఒక్క ఫ్యామిలీ సపోర్ట్ ఉంటె గెలుస్తారా అంటే ఖచ్చితంగా గెలుపుకి సహకరిస్తుంది తప్ప గెలుపు వారి వల్ల రాదు అనే విషయం మెగా ఫ్యామిలీ కి కూడా తెలుసు అయితే అభ్యర్ధుల ఎంపికే జనసేన గెలుపుకి ఎంతో దోహదం చేస్తుంది అందుకే అభ్యర్ధుల విషయంలో పవన్ కళ్యాణ్ ఎంతో కసరత్తు చేస్తున్నారట  ప్రజలు మెచ్చే వాళ్ళని తీసుకుంటే తప్పకుండా పార్టీకి కలిసి వస్తుంది అనుకునే సమయంలో స్వచ్చంద సంస్థల అధినేతలపై దృష్టి పెట్టిన పవన్ ఇప్పటికే కొంతమందిని ఎంపిక  చేశారని తెలుస్తోంది...అయితే ఈ క్రమంలో పవన్

 

సినిమా ఇండస్ట్రీ పై కూడా దృష్టి  పెట్టారని తెలుస్తోంది..అయితే సినిమాలో కేవలం నటులని మాత్రమే కాకుండా స్వచ్చందంగా సేవాకార్యక్రమాలు చేస్తూ ప్రజలలో గుర్తింపు ఉన్న వారిని గెలుపు గురాలని వెతుకుతున్నారట అయితే ఈ విషయంపైనే అన్నయ్యలు చిరు నాగబాబు సలహాలు అడిగిన సందర్భంలో చిరంజీవి అక్కినేని నాగార్జున భార్య అమల పేరు ని ప్రతిపాదించారని తెలుస్తోంది..అమల కేవలం ఒక నటిగా మాత్రమే కాకుండా మూగజీవాల సంరక్షణ మరియు స్త్రీల సమస్యలపై సామాజిక అంశాలపై కూడా ఆమె ఎప్పుడు ముందు ఉంటారు ఈ కోణంలోనే చిరు అమల పేరుని ప్రతిపాదించారని తెలుస్తోంది..

 

అయితే ఇదే విషయంపై నాగార్జున ని సంప్రదించడం కూడా జరిగిందట ఇదిలాఉంటే ఇప్పటికే నాగార్జున వైసీపి అధినేత జగన్ కి మంచి మిత్రుడు అవడం ఇద్దరూ వ్యాపార విషయాలలో కూడా ఉండటంతో ముందు సున్నితంగా తిరస్కరించినా చిరు కి నాగార్జున కి ఉన్న మైత్రి కారణంగా అమలకే ఈ నిర్ణయం వదిలేశారని తెలుస్తోంది..అయితే అమల గనుకా ఏపీలో ఎమ్మెల్యే గా కానీ ఎంపీ గా కానీ..ఎక్కడి నుంచీ పోటీ చేయాలని అనుకున్నా లేదా తమ సొంత జిల్లా కృష్ణా నుంచీ పోటీ చేయాలని అనుకున్నా సరే సీటు ఇస్తామని హామీ ఇచ్చారట పవన్ కళ్యాణ్..మరి ఈ విషయంపై అమల ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో.. వేచి చూడాల్సిందే..అయితే సామజిక స్పృహ ఉన్న అమల జనసేన తరుపున  రాజకీయాలలోకి వస్తే మాత్రం జనసేన కి మరింత బలం చేకూరుతుంది అంటున్నారు విశ్లేషకులు 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: