ఏపీ విడిపోవడానికి కారణం పవన్ కళ్యాణ్, చిరంజీవి అంటున్న టిడిపి నేత!

KSK
తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా విమర్శలు చేశారు. తాజాగా ఇటీవల చంద్రబాబు నాయకత్వంలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన దళిత తేజం సభను ఉద్దేశించి పర్ల రామయ్య సంచలన కామెంట్ చేశారు. దేశంలో దళితుల పట్ల కేంద్ర ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తుంటే రాష్ట్రంలో చంద్రబాబు వారి అభివృద్ధి కోసం పాటు పడుతున్నారని పేర్కొన్నారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ చేయనని కార్యక్రమాలు దళితుల పట్ల టీడీపీ చేస్తుందని అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం చేశారో చెప్పాలని నిలదీశారు.

దళిత బిడ్డలకు ఆర్థిక సాయం చేసి విదేశాలలో చదివిస్తున్న ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అన్నారు. అసలు మీరు ఎప్పుడైనా ఇచ్చారా అని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. మీ నాన్న ఇచ్చారా అని వైసీపీ అధినేత జగన్‌ను ప్రశ్నించారు. ప్రశ్నిస్తాను అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చినా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రశ్నిస్తున్నాను అంటూ ప్రశ్నించారు...2009 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకుల పంచలు ఊడదీసి కొడతాం అని చెప్పి చివరాకరికి ఆ పంచన చేరారని విమర్శించారు. తన అన్న చిరంజీవి పెట్టిన పార్టీ ప్రజారాజ్యం వల్లే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిందని పేర్కొన్నారు.


ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీయాలని ఆలోచిస్తున్న కాంగ్రెస్ పార్టీని గద్దె దించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తే కాంగ్రెస్ పార్టీ ని కాపాడింది ప్రజారాజ్యం అని పేర్కొన్నారు. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాను అంటూ రాజకీయాల్లోకి వచ్చాడు అని ప్రతి సభలో చెబుతున్నాడు ముందుగా తన అన్న చిరంజీవిని ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో ఎందుకు కలిపేశారు అని ప్రశ్నించాలని సూచించారు.

అయితే మరోపక్క వైసీపీ అధినేత జగన్ పై వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు వైసిపి నాయకులు...అసలు దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటా రా అని దళితులను అవమానపరిచిన చంద్రబాబు దళితులను ప్రేమిస్తున్నారు అంటూ వర్ల రామయ్య చెప్పడం సిగ్గుచేటు అని అన్నారు..ఇది రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: