వైసీపీ నేత జగన్ పాదయాత్ర రద్దు!

Edari Rama Krishna
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి  200 రోజులు పూర్తయ్యింది.  జగన్ మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా ప్రజలు నీరాజనాలు పట్టారు.  తమ ప్రియతమ నేత రాజశేఖర్ రెడ్డి మళ్లీ కళ్లముందుకు వచ్చారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  జగన్ చేస్తున్న ప్రజాసంకల్ప యాత్ర ద్వారా ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపుతూ... ప్రభుత్వ ఫలాలు అందని బాధితులకు అండగా నిలుస్తూ వారికి ధైర్యాన్ని ఇస్తూ ముందుకు సాగుతున్నాడు.

2500కిలోమీటర్లకు చేరువై, 200 రోజులను పూర్తి చేసకున్న ప్రజా సంకల యాత్ర ఆనాడు రాజశేఖర్ రెడ్డి చేసిన మహా ప్రస్థానాన్ని మరోమారు గుర్తు చేసింది.నవంబర్ 6, 2017 వైయస్ఆర్  జిల్లా పులివెందుల నియోజకవర్గం నుంచి ప్రజా సంకల్పానికి తొలి అడుగు పడింది. వైఎస్సార్ ఘాట్ వద్ద ఉద్వేగపూరిత వాతావరణంలో, జగన్ తన ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. అడుగులో అడుగేస్తూ అశేష జనవాహిని మద్దతుతో నేటికీ 200 రోజులు తన  పూర్తి చేసుకున్నారు జగన్.

ఇదిలా ఉంటే.. 201వ రోజు పాదయాత్ర వర్షం కారణంగా రద్దయింది. షెడ్యూలు ప్రకారం నేటి పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా భీమనపల్లి నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో... పాదయాత్ర సాధ్యం కాలేదు. మరోవైపు, పాదయాత్ర 200వ రోజు పూర్తయిన సందర్భంగా జగన్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. దేవుడి దయ వల్ల అధికారంలోకి వస్తే రాజన్న పాలనను తీసుకొస్తానని చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: