మమ్మల్నిఎవరూ తాకలేరు! కుమారస్వామి ధీమా!!

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి - రాష్ట్రంలో కాంగ్రెస్‌-జెడిఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం మనుగడ పై వెల్లువెత్తుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు 2019 సార్వత్రిక ఎన్నికలు ముగిసేంత వరకూ తనను ఎవ్వరూ కనీసం తాకలేరని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి స్పష్టంచేసారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసేంత వరకూ తన దగ్గర కు సైతం ఎవ్వరూ రాలేరన్నారు. సంకీర్ణ ప్రభుత్వ పటిష్టత పై ఎలాంటి సందిగ్ధత అవసరం లేదని, అది పారదర్శక పాలన అందిస్తుందని అన్నారు. ఏడాదిపాటు తనను ఎవ్వరూ తమ దరిచేరలేరని అన్నారు. కనీసం ఏడాది పాటు అయినా కొనసాగుతానని, లోక్‌సభ ఎన్నికలు ముగిసేంత వరకూ ఈ ప్రస్తావనే రాదని అన్నారు. అప్పటివరకూ ఏ ఒక్కరు తనను ఏమీచేయలేరని ధీమాగా అన్నారు. 

ఈకాలంలో తాను ఎంత మాత్రం మౌనంగా ఉండలేనని, రాష్ట్ర ప్రయోజనాలను ఆశించే తాను నిర్ణయాలు తీసు కుంటానని అన్నారు. సమయం వృధా చేయబోనని, పను ల్లోనే కొనసాగుతానని తన వరకూ రాష్ట్ర ప్రగతి ముఖ్యమని ఆయన అన్నారు. తనకు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం వచ్చిందని, తాను ఏంచేసేది సందేశాత్మకంగా ఉంటుందని, తన కార్యాచరణకు రాజకీయ వాతావరణం కూడా అనుకూలంగా ఉందన్నారు. 

సంకీర్ణ రాజకీయాల్లో తన పార్టీ ప్రసవ వేదనతో ఉందన్న వాదనను ఆయన కొట్టివేసారు. కేబినెట్‌ విస్తరణలో కొందరు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను తీసుకోకపోవడం పై వచ్చిన నిరసనను ఆయన ఈ సందర్భం గా ప్రస్తావించారు. రాష్ట్ర ప్రయోజనాలపైనే తన నిర్ణయాలు ఉంటాయన్నారు. మే 12వతేదీ హంగ్‌ అసెంబ్లీ తీర్పు వచ్చిందని, కాంగ్రెస్‌-జెడిఎస్‌ ఇరువురూ పరస్పరారోపణలు చేసుకున్నాచివరకు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయిందని అతిపెద్ద పార్టీగా వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేయలేక పోయిందని బిజెపి పై ఆయన నిశితంగా విమర్శించారు. 


రైతు రుణమాఫీకి తాను కట్టుబడి ఉన్నానని, త్వరలోనే  ప్రకటిస్తానన్నారు. రైతు సోదరులు రుణమాఫీపై అపోహలువద్దని, మాఫీకే తాను కట్టుబడి ఉన్నట్లు, శాస్త్రీయంగా నిర్వహించేందుకే కొంత వ్యవధి తీసుకుంటున్నట్లు వివరించారు.ఎక్కువసంఖ్యలో రైతులకు మేలు చేయడానికే కృషిచేస్తున్నట్లు వెల్లడించారు.  ప్రతిపక్షాల్లోని రైతు సంఘాలు ముఖ్యమంత్రి పై తన ఎన్నికల హామీ రైతు రుణ మాఫీ అమలు చేయాలన్న ఒత్తిడిని పెంచాయి. పక్షం రోజుల్లోపే ప్రకటించాలని డిమాండ్‌ చేసాయి. దీనితో కుమారస్వామి తానురుణమాఫీకి కట్టుబడి ఉన్నట్లు వారికి నచ్చచెప్పారు. అలాగే రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను జులై మొదటి వారం లోనే ప్రవేశ పెడతామని ఆయన అన్నారు.

కొంతమంది నేతలు సంకీర్ణ ప్రభుత్వం బడ్జెట్‌ ఎందుకు ప్రవేశపెడుతోందని, ఇప్పటికే కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని విమర్శలు లేవనెత్తారు. బడ్జెట్‌ను ప్రవేశ పెడితే కుమారస్వామికి పేరొస్తుందని కొందరు నేతలు కుట్రలు చేస్తున్నారని, తీవ్ర తర్జన బర్జనల తర్వాత ఆర్ధిక శాఖన్ ను (ఫైనాన్స్‌ పోర్టుఫోలియో) ను తనవద్దనే ఉంచుకున్న సంగతి తెలిసిందే.


వ్యూహాత్మక, దీర్ఘకాలిక ప్రణాళికతోనే తాము సంకీర్ణాన్ని నడప బోతున్నామని, ఆషామాషీ ఉద్దేశాలేమీ తమకు లేవని ప్రజలకు సుపరిపాలన అందించి వారిని ముఖ్యంగా రైతువర్గాన్ని సంతృప్తి పరచటమే తమ ధ్యేయంగా అభివర్ణించారు కుమారస్వామి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: