చీ..చీ..టీడీపీని నమ్మి దారుణంగా మోసపోయా!

siri Madhukar
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ‘ప్రజా సంకల్ప యాత్ర’ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న జగన్ అధికార పార్టీ చేస్తున్న అరాచకాలను ఎండగడుతూ వస్తున్నారు. జగన్ పాతయాత్రం సందర్భంగా నరసాపురం జనసంద్రమైంది. వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర  నరసాపురం నియోజకవర్గంలో దిగ్విజయంగా సాగింది. సాయంత్రం నరసాపురం స్టీమర్‌ రోడ్డులో జరిగిన బహిరంగ సభకు ప్రజలు పోటెత్తారు.

జగనన్నకు జేజేలు పలికారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..చంద్రబాబు నరసాపురం నియోజకవర్గానికి ఇచ్చిన హామీల అమలుపై ధ్వజమెత్తారు. తాను నియోజకవర్గంలోకి ప్రవేశించగానే ప్రజలు తన వద్దకు వచ్చి.. ఎన్నికలప్పుడే చంద్రబాబుకు తాము గుర్తుకువస్తామని ముఖ్యమంత్రి తీరు గురించి ఆవేదన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. నాలుగేళ్లుగా రాజధాని అని సినిమా చూపిస్తున్నట్టే.. అదిగో వశిష్ట వారధి అంటూ ఇక్కడి ప్రజలకూ చంద్రబాబు సినిమా చూపిస్తున్నారని జననేత ధ్వజమెత్తారు. 

ఇదిలా ఉండగా..జగన్ ప్రజాసంకల్పయాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రాంతంలో జరుగుతుండగా, ఓ ఆసక్తికర ఘటన జరిగింది. మురళీకృష్ణ అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త, జగన్ ను కలసి తన కష్టాలను చెప్పుకుంటూ, టీడీపీని నమ్మి మోసపోయానని చెబుతూ, తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డును చింపేసి నడిరోడ్డుపై విసిరేసి తన నిరసన తెలిపాడు. తాను విజయవాడ కు చెందిన యువకుడిని అని..తెలుగు దేశం జండాలు మోశానని..ఎక్కడ తెలుగు దేశం పార్టీ సభలు జరిగినా..అక్కడ జండాలు కట్టి..మోసినా తనకు మాత్రం టీడీపీ నుంచి ఎలాంటి న్యాయం జరగలేదని అన్నారు. తనకు ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించమంటే, డబ్బులు అడుగుతున్నారని వాపోయాడు.

విజయవాడ కార్పొరేషన్ లో ఉద్యోగం కోసం మూడు లక్షలు డిమాండ్ చేస్తున్నారని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కోసం లంచం ఇవ్వలేక, కూలీగానే బతుకుతున్నానని చెప్పుకున్నాడు.  దీనికి స్పందించిన వైఎస్ జగన్ ఇలాంటి తమ్ముళ్లు ఎంతో మంది టీడీపీని నమ్ముకొని అన్యాయం అయ్యారని..టీడీపీ ప్రభుత్వం అంటేనే లంచగొండి తనానికి కేరాఫ్ అడ్రస్ గా మారిందని అన్నారు. రాబోయేది ప్రజా ప్రభుత్వమని, ఇటువంటి తమ్ముళ్లందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చి ముందుకు కదిలారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: