దారి తప్పి వివేకం మరచి బూతులు మాట్లాడే ముఖ్యమంత్రి

ఏపి ముఖ్యమంత్రికి అనుభవం అపారం. రాజకీయాల్లో ఆయన్నుమించిన అనుభవఙ్జుడు ఏవరూ లేరని ఆయన అనేక సందర్భాల్లో వందల సార్లు చెప్పారు. అయితే ఆయన నోట బూతులు మాత్రం ఎప్పుడూ వినలేదు. అయితే వెన్నుపోటుతో ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుణ్ణి చేసి అధికార పీఠం పై ఆయన్ను ఆయనే అధిష్టింప జేసుకున్న రోజు ల్లో నారా చంద్రబాబు నాయుడు, ఆయన మామగారు, నాటి ముఖ్యమంత్రి,  ఆంధ్రుల ఆరాధ్య నటుడు నందమూరి తారక రామారావు గారిని ఉద్దేశించి బూతులు మాట్లాడారు అని బాగా ప్రచారంలో ఉండేది.


అలాగే ఇటీవల మరణించిన దేవినేని నెహ్రూ ఒక టెలివిజన్ చానల్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పాడు. పూజ్య ఎన్టీఆర్ ను ఉద్దేశించి ఒక బూతు పదం, ఆయన కొడుకులను ఉద్దేశించి అదే బూతు పదం చంద్రబాబు ఉపయోగించారని దేవినేని నెహ్రూ చెప్పాడు. ఒకవైపు ఎన్టీఆర్ ను ఇంద్రుడు, చంద్రుడు, మహానుభావుడు, దేవుడు అని చంద్రబాబు రాజకీయ సంభందాల్లో సమావేశాల్లో ఇప్పుడు కూడా అంటూ ఉంటారు.


అలాంటి గౌరవనీయుడు పిల్లనిచ్చిన మామను వెనకనుంచి వేటేయటమేకాకుండా ఎన్టీఆర్‌ను "మొద్దు..ల.." అంటూ దూషించాడట మన మహనీయ చంద్రబాబు. ఎన్టీఆర్ కొడుకులందరిని అంటే బాలకృష్ణతో కలిపి బావమరుదులందరిని కూడా అదే మాట పలుమార్లు అన్నారట. హరిక్రిష్ణను పార్టీకి అధినేతగా చేస్తానని ఎన్టీఆర్ అనడం తో భరించలేని చంద్రబాబు అలా అన్నట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ విషయంలో, బామ్మర్దుల విషయంలో ఆయన అలా మాట్లాడటం చంద్రబాబు వ్యక్తిగతం సిగ్గులేక పోతే వారీందరి వ్యక్తిగతం. అది తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో మాటల మధ్య వాడిన బూతు అని సరిపెట్టు కుందాం. 


అయితే ముఖ్యమంత్రి కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు మాట్లాడుతూ, "ప్రతిపక్షాల వాళ్లు ఏం పీకారు?" అని వ్యాఖ్యా నించడం అందరికి స్టన్నింగ్. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఒక భాగం. "చంద్రబాబు శంకుస్థాపనలు తప్ప మరేం చేయడం లేదు" అని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తూ ఉండగా, దానిపై చంద్రబాబు ఘాటుగా స్పందిస్తూ "వాళ్లు ఏం పీకారు?" అని ప్రజలని ప్రశ్నించాడు. ముఖ్యమంత్రి హోదా లో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం నీచాతి నీచమని చెప్పాలి.


అలాగే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది? అని కూడా బాబు ప్రశ్నించాడు. ఇంతవరకెప్పుడు, అయితే ఇప్పటి వరకూ వైసీపీ ఎక్కడా అధి కారంలోకి రాలేదు. రాజకీయాల్లో మహా విఙ్జానఖనైన చంద్రబాబు ఈ మద్య తనలో పెరుగుతున్న మానసిక గందర గోళంలో వైసీపీ అధికారంలోకి వచ్చినట్లు కలగన్నారేమో నని వైసిపి వాళ్ళు అంటున్నారు. బహుశ అదే జరుగనుంది కదా!  అంటూ చతురోక్తులు విసురుతున్నారు.


అసలు సందర్భం ఏమంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమకు అవి చేశా, ఇవి చేశా, చాలా పరిశ్రమలు వచ్చేశాయని, ఉద్యోగాలు వచ్చేశాయని ఊదరగొడుతుంటే ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగారట. దాంతో ఆయనకు ఎక్కడ లేని అసహనం వచ్చిందట. మీడియాలో వచ్చిన ఈ సమాచారం చూడండి. 



ఓర్వకల్లులో శంకుస్థాపనలు చేస్తున్నారు సరే, ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు సీఎం స్పందిస్తూ "ప్రతిపక్షాల్లా మాట్లాడుతున్నారు. ఇన్నాళ్లూ వాళ్లేమి పీకారు" అన్నారు. ఆ వెంటనే తేరుకుని అన్ని పనులు ప్రణాళికాబద్ధంగా చేస్తామని చెప్పారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: