మమతా బెనర్జీ ఇచ్చిన షాక్ కి...కేసీఆర్ కి దిమ్మతిరిగిపోయింది!

KSK
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా ఒక కొత్త కూటమి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కొత్త కూటమి ఏర్పాటులో భాగంగా ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో కరుణానిధిని కలిశారు... అలాగే ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ని కూడా సంప్రదించడం జరిగింది. దీంతో ఓటమి ఏర్పాటులో కెసిఆర్ పేరు మారుమ్రోగుతున్న క్రమంలో ఊహించని విధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రూపంలో కెసిఆర్ కి షాక్ తగిలింది.


గతంలో కూటమి ఏర్పాటు చేయక ముందు చాన్నాళ్ల క్రితమే కేసీఆర్ బెంగాల్ వెళ్లి మమతను కలిసి చర్చించి వచ్చారు. అక్కడి నుంచే మమతతో కలిసి మీడియా ముందుకు వచ్చి ఒక ప్రకటన కూడా చేసారు. ఆ ప్రకటన నేపథ్యంలోనే ఆ ప్రకటన చేసే సమయంలో మమత కూడా కేసీఆర్ పక్కనే వున్నారు కాబట్టి టిఆర్ఎస్ అధినేత పెట్టబోఏ కూటమికి మమతా మద్దతు ఉందని అందరూ భావించారు.


అయితే తాజాగా ఆర్ధిక మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు బెంగాల్ ఆర్ధిక శాఖ మంత్రి ఆంద్రప్రదేశ్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ ని అంతర్మధనంలో పడేసాయి. బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనేక మంది నాయకులతో మాట్లాడుతున్నారని… అదే విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌తోనూ చర్చలు జరిపారని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి అమిత్‌ మిత్రా పేర్కొన్నారు.


అంతేకాకుండా కెసిఆర్ ఏర్పాటుచేసిన కూటమికి మా మద్దతు ఏమీ ఉండదని కేవలం అండగా మాత్రం ఉండమంటే ఉంటామని పేర్కొన్నారు. తాజాగా ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా చేసిన కామెంట్స్ కి కేసిఆర్ మతిపోయింది. ఈ దెబ్బకి జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతా మనకున్న కేసిఆర్ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది,



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: