నారా లోకేష్ అందుకేనా రంగ స్ధలాన్ని మెచ్చుకున్నది..!

Prathap Kaluva

టీడీపీ పార్టీ నారా లోకేష్ రంగ స్థలం సినిమా చూసి ఆ సినిమా హీరోను చిత్ర యూనిట్ ను పొగిడిన సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్  అయిపోయి సుమారు నెల రోజులు గడిచిపోతుంటే ఇప్పుడు స్పందించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే ఒక పక్క పవన్ కళ్యాణ్ నారా లోకేష్ మీద అవినీతి ఆరోపణలు చేస్తుంటే నారా లోకేష్ మాత్రం విమర్శలు చేయక పోగా పవన్ కళ్యాణ్ ను ఎవరో తప్పు దోవ పట్టిస్తున్నారని పవన్ కళ్యాణ్ సమర్ధిస్తున్నాడు. 


అయితే నారాలోకేష్ సినిమా గురించి ట్వీట్ చేయడం వెనుక వేరే లెక్కలు ఉన్నాయని అందరు అనుకుంటున్నారు. పవన్ కల్యాణ్ కు స్థిమితం లేదు, అవగాహన లేదు, ఆయన దగ్గర స్థిరత్వం లేదు.. అనే అంటున్నారు టీడీపీ లీడర్లు. అయితే పార్టీలోని కాపు లీడర్లతో పవన్ కల్యాణ్ ను అనరాని మాటలు అనిపిస్తున్నారు. మంత్రులు చెలరేగి పవన్ పై విరుచుకుపడుతున్నారు. మండిపడే బాధ్యతలను వాళ్లకు అప్పగించి లోకేష్ ఆయింట్ మెంట్ వేస్తున్నాడు.


పవన్ కల్యాణ్ మంచోడు, రంగస్థలం బాగుంది అని తీయని మాటలు మాట్లాడుతున్నాడు.  మరి అంత మంచోడు అయిన పవన్ కల్యాణ్ ను తెలుగుదేశం మంత్రులు అన్ని మాటలు అంటుంటే లోకేష్ వారించడేం? టీడీపీలోని కాపుల చేతేమో తిట్టిస్తారు, కాపు ఓట్లు పూర్తి దూరం కాకుండా లోకేష్ రివర్స్ లో మాట్లాడుతున్నాడు. వాట్టే డబుల్ గేమ్. టీడీపీ ఆడే డబుల్ గేమ్స్ లో ఇది మరోటి!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: