చంద్రబాబుకు షాకింగ్ ! సుజనా చౌదరి బిజెపి లోకి జంప్ చేయబోతున్నారట?

గత మార్చి నెలలో కేంద్రమంత్రిగా రాజీనామా చేసిన రోజుల్లో "నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను మోసం చేయలేదని వ్యాఖ్యానించారు" కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి. అయితే హామీల అమలులో మాత్రం ఆలస్యం జరిగిందని అన్నారు. ప్రత్యేక హోదా, మిగతా విభజన హామీలు నాడు పోరాడి సాధించుకుంటామన్నారు. తాజా కేంద్రబడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయంపై మొదలైన రచ్చతో కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ, ఏపీ కేబినెట్ నుంచి బీజేపీ, బయటకు వచ్చాయి. ఇరు పార్టీల నేతలు కొంత సీరియస్‌గా రాష్ట్రానికి రావాల్సిన దానిపై, రాష్ట్రానికి ఇచ్చిన దానిపై కామెంట్లు చేసుకుంటున్నారు. 

అయితే ఆ సందర్భంగా రాజీనామా చేయాల్సిన పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడిన సుజనాచౌదరి. కేంద్రానికి భయపడాల్సిన అవసరం చంద్రబాబుకు లేదన్నారు. బీజేపీ మంత్రుల రాజీనామా కంటే ముందుగానే టిడిపి మంత్రుల రాజీనామాల గురించి పార్టీ అధ్యక్షులు చంద్రబాబు ప్రకటించారని గుర్తు చేసిన సుజనా చౌదరి తమ నిరసన తెలియ జేయడానికే కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకుంటూ రాజీనామాలు చేశామన్నారు. 
ఎన్డీఏలో కొనసాగడం, లేదా బయటకు రావడం అనే విషయాలపై పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబే నిర్ణయం తీసుకుంటారన్న కేంద్ర మాజీమంత్రి, రాష్ట్రానికి కావాల్సిన సాధించుకోవడానికే ఎన్డీఏలో కొనసాగుతున్నామని, పోలవరం, రాజధాని నిధులు కొంత వచ్చినా,  రైల్వేజోన్, ఇతర హామీలు నెరవేరుస్తారని అనుకుంటున్నా మని అన్నారు. హామీల అమలు విషయంలో బీజేపీ ఆలస్యం చేస్తోందని మొదటి నుంచీ చెబుతున్నామంటున్న సుజనాచౌదరి, ఒక టివి చానల్ ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. 

అయితే ఇది రాజకీయం, ఎప్పటికప్పుడు సమీకరణాలను అర్థంచేసుకుని ముందుకు వెళ్లకపోతే అంతే సంగతులు. ప్రత్యేకించి వ్యాపారం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లకు వేరే భావోద్వేగాలేమీ ఉండవు. తమ వ్యాపారాలకు అనుకూలత ఉండాలి, తమపనులు జరగాలి, అందుకోసమే వారికి పదవులుకావాలి వాటితో లాబీయింగులు చేసుకోవాలి. ఆ లాబీయింగులు చేసుకోవాలంటే అధికారంలో ఉన్న పార్టీతో సఖ్యతగా ఉండాలి. ఇవే వారి లెక్కలు. కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి లెక్కలు కూడా ఇవే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

సుజనాచౌదరి త్వరలోనే పార్టీ మారబోతున్నారని అదీ భారతీయ జనతా పార్టీ కే అనే మాట వినిపిస్తోంది. ఇప్పుడు కాదు, ఎన్డీయే నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు రావాలన్నప్పుడే - కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలని చంద్రబాబు చెబితే - దానికి సుజనాచౌదరి తన అనంగీకారం తెలిపారట. తను రాజీనామా చేయనని మంత్రిగా కొనసాగుతానని ఆయన పట్టుబట్టినట్టుగా తెలుస్తోంది.  అయితే సుజనాచౌదరి రాజీనామా చేయకపోతే తన పరువు, పార్టీ ప్రతిష్ఠ మంటగలిసి పోతాయని, చంద్రబాబు తీవ్రమైన ఒత్తిడి తెచ్చి రాజీనామా చేయించాడనే మాట అప్పట్లోనే వినిపించింది. చంద్రబాబు నాయుడుకు అప్పుడు అలా కాస్త మనశ్శాంతి దొరికింది. అయితే ఆ తర్వాత కూడా సుజానా చౌదరి బీజేపీ నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నాడు. అరుణ్ జైట్లీతో సమావేశం కావడం కూడా జరిగింది. ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ మీటింగ్ లో చర్చకు జరిగింది. 

ఒకవైపు కేంద్రంపై మనం పోరాడుతున్నామని చెబుతున్నామని, కానీ మనవాళ్ళే కొందరు వెళ్లి బీజేపీ సీనియర్లతో సమావేశం అవుతున్నారని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత బీజేపీ నేతలతో కలవవద్దు అని చంద్రబాబు నాయుడు సుజానాచౌదరిని ఆదేశించాల్సివచ్చింది.

అయితే ఇప్పుడు సుజానాచౌదరి చంద్రబాబు మాటను ఖాతర్ చేసే పరిస్థితుల్లో లేడని, బీజేపీతో సత్సంబంధాలు కొనసాగుతున్నాయని, ఆయన తెలుగుదేశాన్ని వీడి - బీజేపీ వైపు అడుగులు వేస్తున్నరని ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోని కమ్మవాళ్లను బీజేపీ వైపు నడిపించడం కూడా మొదలు పెట్టాడట సుజానాచౌదరి. ఇదంతా, ముఖ్యమంత్రి చంద్రబాబు, టిడిపి అనుకూల పచ్చమీడియా ప్రవర్తన వలన - సమాజంలో కమ్మవారు ఒంటరి వాళ్ళవుతున్నా రనే పాయింట్ కేంద్రంగా తనవాదన వినిపిస్తున్నారని అంటున్నారు. జరగాల్సిందంతా సుజానాచౌదరి నైపుణ్యంతో ప్రీ-ప్లాన్డ్ గా, ప్రణాళికాబద్ధంగా జరిపిస్తున్నారని  విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: