పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు టివి-9 అధినేత లీగల్‌ నోటీసులు

సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కు ఒక మీడియా సంస్థ యజమాని చింతలపాటి శ్రీనివాస రాజు షార్ట్ గా శ్రీనిరాజు నోటీసులు పంపారు. తనను ఉద్దేశించి ట్విటర్‌ లో అభ్యంతకర వ్యాఖ్యలు చేశారంటూ నోటీసు లో పేర్కొన్నారు. అంతేకాదు ట్విటర్‌ లో పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు నిరాధారం, అసత్యాలని ఆరోపించారు. ఈ మేరకు శ్రీనిరాజు తన తరఫు న్యాయవాది నుంచి పవన్‌ కల్యాణ్‌ కు నోటీసులు పంపారు.


పవన్‌ కల్యాణ్‌ తనపై ట్విటర్‌ లో చేసిన వ్యాఖ్యలు తెలిసి శ్రీనిరాజు షాక్‌ అయ్యారని ఆయన న్యాయవాది నోటీసులో పేర్కొన్నారు. నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తే, మిగిలిన రాజకీయ నాయకులకూ పవన్‌ కల్యాణ్‌ కు తేడా ఏంటని ప్రశ్నించారు.  శ్రీనిరాజుకు ప్రత్యక్షంగానూ, పరోక్ష్యంగానూ చిత్ర దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మతో ఎటువంటి బంధం సంబంధం లేదని చెప్పారు. 

రాం గోపాల్ వర్మ, రవి ప్రకాశ్‌ తో కలిసి శ్రీనిరాజు టీడీపీ నేతలకు సాయం చేస్తూ, తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి సహకరించారని చెప్పడం కేవలం ఊహా జనితమేనని తన క్లయింట్‌ అన్నట్లు నోటీసు లో పేర్కొన్నారు. ప్రజలు తనపై ఆరోపణలు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత బాధపడ్డారో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన ఈ నిరాధార వ్యాఖ్యలకు తన క్లయింట్‌ కూడా అంతే బాధపడ్డారని చెప్పారు.

శ్రీనిరాజు ప్రముఖ పిలాంత్రపిస్ట్ అనేక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విద్యాసంస్థలకు ప్రత్యక్షంగాను పరోక్షణగాను ఎంతో సహాకారం అందిస్తుంటారు. అనేక అంకుర సంస్థలకు అధార భూతంగా ఉంటూ యువ పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సహిస్తూ ఆలంబన గా ఉన్నారు. శ్రీని ఆర్ధిక మానేజ్మెంట్ రంగాల్లో అత్యున్నతుడు. ప్రపంచ స్థాయి విద్యా సంస్థ "ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ -ఐ.ఎస్.బి - నిర్వాహక వ్యవస్థలో సభ్యుడు కూడా.   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: