పవన్ కు టిడిపి కి సీట్ల దగ్గరేనా బెడిసింది..!

Prathap Kaluva
పవన్ కళ్యాణ్ టిడిపి పార్టీ కి ఒక కంచు కోట లా నిజం చెప్పాలంటే 2014 ఎన్నికల్లో గెలిపించడం నుంచి ఇప్పటివరకు టీడిపి కి వెన్ను దన్ను గా నిలబడ్డాడు. అయితే మొన్న గుంటూరు సభ లో ఒక్క సారిగా యు టర్న్ తీసుకోని టీడిపి ని ఒక ఆట ఆడుకున్నాడు. ముఖ్యంగా లోకేష్ మీద చేసిన అవినీతి ఆరోపణలు ఆంధ్ర ప్రదేశ్ లో సెన్సేషన్ నెలకొల్పాయి.

ఎంత తీవ్రంగా అంటే లోకేష్ అవినీతి కారణంగా ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది అన్నంతగా. ఇంత తీవ్రంగా పవన్ ఎందుకు లోకేష్ ను టార్గెట్ చేసారు. ఈ విషయంలో రాజకీయ వర్గాల్లో చాలా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకటి లోకేష్ తన సహచర మంత్రులతో, నాయకులతో మాట్లాడినపుడల్లా, పవన్ ప్రస్తావన వస్తే చాలు, తేలిగ్గా కొట్టిపారేసేవారని తెలుస్తోంది. పవన్ గురించి పట్టించుకోవాల్సింది ఏదీ లేదని అనేవారట. ఇవి కొందరు మంత్రులు, నాయకులు పవన్ కు చేరవేసినట్లు తెలుస్తోంది.

ఇలా చేరవేసిన వాళ్లు భవిష్యత్ ప్రణాళికల దృష్ట్యా పవన్ తో టచ్ లో వుంటూ, తేదేపాలో వుంటున్నవారన్నమాట. నికి తోడు రాబోయే ఎన్నికల్లో తనతో పొత్తు కావాలంటే కాస్త భారీగానే ఎమ్మెల్యేలు,  ఎంపీల వాటా కావాలని పవన్ అడిగారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఫై వరకు ఎమ్మెల్యేలు, అరడజను ఎంపీలు తమ పార్టీకి వదలాలన్నది పవన్ డిమాండ్ అంటున్నారు. దీనికి బాబు ససేమిరా అన్నారని,  ఒక ఎంపీ, ఆరు నుంచి ఎనిమిది ఎమ్మెల్యేలు మాత్రం ఇవ్వగలనని చెప్పారని రాజకీయ వర్గాల బోగట్టా. బాబు ఇలా మాట్లాడడం వెనుక లోకేష్ ప్రోద్బలం వుందని కొందరు పవన్ కు కాస్త గట్టిగానే ఫీడ్ బ్యాక్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. దీంతో ఇక అక్కడ సాధించేది ఏమీ వుండదని ఫిక్స్ అయి, తిరుగుబాటు జెండా ఎగరేసారన్నమాట పవన్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: