ఎడిటోరియల్: పవన్ కళ్యాణ్ పై చంద్రబాబు శ్రీరంగనీతులు ప్రజల రిటార్టులు


జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ పై తెలుగు దేశం అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. కారణం పవన్ కళ్యాణ్ తెలుగు దేశం నాయకుణ్ణే కాదు ఆయన తనయుణ్ణి విమర్శించారు. టిడిపిని బలహీనపరిస్తే పవన్ కళ్యాణ్ కి వచ్చేదేమిటి? దానివల్ల తనకు ఏం లాభం? అని పవన్ కళ్యాణ్ ను నిలదీశారు.


"జనసేన నాయకుడు తనను విమర్శంచటం ఏమిటి? తను ఎప్పుడైనా వైసిపిని విమర్శించాలి కదా! అదీ కదా! రూలు! ఎవరైనా ఇప్పుడు భారత ప్రధాని నరెంద్ర మోడీని, వైసిపి అధినేత జగన్మోహనరెడ్డిని తిట్టాలి అంటే ఇదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శాసనసభ సాక్షిగా ప్రజలకు, పవన్ కు సందేశం ఇచ్చారు."

పవన్ కు నాలుగేళ్లు కనబడని అవినీతి ఇప్పుడు కనబడిందా? అని ప్రశ్నించారు.


"కాని తనకు ప్రత్యేక హోదా నరెంద్ర మోడీ ఇవ్వడని ఇప్పుడే తెలిసిందా? దాదాపు సంవత్సరమునర క్రితమే చెప్పారు గదా? ఎవరూ ఆయనను ప్రశ్నించ రాదు ఎందుకంటే ఆయన నీతి నిజాయతీ ఉన్న ఋజువర్తనుడు నిప్పు, ఆయనను టచ్ చేస్తే బస్మమైపోతారు."  


విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో ఆదరణ పథకం ప్రారంభోత్సవంలో చంద్రబాబు మాట్లాడుతూ "కొందరు మన రాష్ట్ర నాయకులు భాజపాకు వంత పాడు తున్నారు. ఇది దుర్మార్గం 


"ఇంతవరకు ఆయన బాజపాకు వంత పాడలేదా? పాడిందెవరు మోడీని భుజాలపై మోసిందెవరు? ఆయనైతే బాజపా వంత నాలుగేళ్ళు పాడగా లేంది మనమంతా ఎందుకు వంత పాకూడదు?" 

వైకాపా నేతలు నన్ను విమర్శించి కేంద్రాన్ని ఏమీ అనడం లేదు.  ఇక్కడ మాటలు మాట్లాడు తున్నారు. డీల్లీలో రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నారు.


వైకాపా ఎమెల్యేలను తన పార్టీలోకి లాక్కుని, నాయకుణ్ణి దేశ ద్రిమ్మరిని చేయగా, వారు ఈయన్ని తప్ప మోడీని ఎందుకు విమర్శిస్తారు?  పక్కింటోడి పెళ్లాన్ని లేపుకెళితే వాడు ఊర్కుంటాడా? వీడి కొంపకు నిప్పెట్టడా?


కేసుల మాఫీ కోసం రాజీపడి హక్కులు తాకట్టుపెట్టే పరిస్థితికి వస్తున్నారు. భావితరాల భవిష్యత్తు ను అంధకారం చేస్తున్నారు.


తను ఆడించిన ఓటుకు నోటు నాటకం, బ్రీఫ్డ్ మి వీడియోలు, తన నేఱాలకు సాక్ష్యం కాదా? దాని కోసం 10/15 యేళ్ళ కాలం ఉచితంగా వాడుకోవలసిన రాజధాని హైదరాబాద్ ను వదిలేసి రాలేదా?భవిష్యత్ అంటే ప్రజలదా? లోకేష్ దా? లోకేష్ కు తప్ప, ఎవరికి ఉద్యోగా లొచ్చాయి?   ప్రజల భవిష్యత్ గుఱించి ఆలోచించే వాడైతే ఒక దశాబ్ధకాలం పాటు రాజధానిగా హైదరాబాద్ ను ఉచితంగా వినియోగించుకొంటూ అమరావతిని ఎంతో అద్భుతంగా నిర్మించుకోవలసిన సమయం ఓటుకు నోటుకు బలిచేసిందెవరు? ఙ్జానం లేని పవన్, ప్రతిపక్షం దీనిపై సి బి ఐ విచారణకొసం ప్రయత్నించక పోవటం అనేది క్షమించరానిది. విభజన చట్టం ప్రకారం లభించిన ఈ ప్రయోజనాన్ని వదిలేసి "ప్రత్యేక హోదా" ఎందుకడుగుతున్నావని రేపు మోడీ ప్రజా న్యాయ స్థానం లో ప్రశ్నించడా?   

 

పవన్‌ కళ్యాణ్ ను ఉద్దేశించి  "ఈ కష్ట సమయంలో ఎవరైనా కేంద్రం మోసాన్ని, నరేంద్ర మోదీని నిలదీయాలి. హక్కుల కోసం పోరాడాలి అలా కాకుండా నన్ను నా కుమారుణ్ణి విమర్శించి బల హీనపరిస్తే ఆయనకొచ్చే లాభమేంటి?  రాష్ట్రానికి వచ్చే ప్రయోజనమేంటి? ప్రజల ద్వారా అడుగుతున్నాఅన్నారు.


పవన్ కళ్యాణ్ నరెంద్ర మోడీ తో నయాన్నో భయాన్నో ప్రలోభాన్నో ప్రయొగించి ప్రత్యక్ష హోదా తీసుకొచ్చినా  ఆయన్ను ప్రశంసించ కూడదు. ప్రత్యేక హోదా బాబు ద్వారానే రావాలి. వెరే వాళ్ల ద్వారా వచ్చినా బాజపా తో కలిపి ఆ క్రెడిట్ తన హుండీలో వేయాలి. అప్పుడే పవన్ కళ్యాణ్                              మంచివాడు  .  ఏమాత్రం చంద్రబాబును లోకేష్ ను ప్రశ్నించనంతవరకే ఆయనకు ఆ గౌరవం లేకపోతే మొత్తం టిడిపి వందిమాగద బృందం  - పచ్చ చానళ్ళు - పచ్చ పత్రికలు పంచాయతీ పెట్టేసి చంద్ర బాబుకే ‘టముకు’ వాయించి ముగిస్తారు.


“పన్నుల రూపంలో మనం ఇచ్చిన డబ్బులే తిరిగి మనకు ఇస్తున్నారు”


బాబు గారు! నాలుగు దశాబ్ధాల సుధీర్గ రాజకీయ అనుభవం ఉన్న మీరే నాలుగేళ్ళలో కూడా నరెంద్ర మోడీని అర్ధం చేసుకోలేక పోతే, ఏ రాజకీయ అనుభవమూ లేని పవన్ నాలుగేళ్ళ మీ పరిచయం, మెస్మరిజం, మాయలో పడి ఆ ఊబి నుండి బయటకు రావడం సాధ్యమా? పవన్ మిమ్మల్ని అర్ధం చేసుకోవటం కుదిరేపనేనా? బహుశ జీఫెఫ్సి తో ఆయన మిమ్మల్ని వదలి బయటి ప్రపంచలోకి రావటం తోనే జెపిని, ఉండవల్లిని, పద్మనాభయ్యని, ఐవైఆర్ ని కలిసి రాజనీతిఙ్జుల మద్యలో ఉండటం వలన ఆ కాస్త రాజకీయ విద్యాగంధం అబ్బి ఉండొచ్చు. మీతో ఉంటే మోసాలు చెయ్యటం, వెన్ను పోట్లు పొడవటం, నమ్మిన స్నేహితుని పై మీ వైఫల్యాలు నెట్టేయటం, చివరకు వాణ్ణి బదనాం చేయటం, నేర్చుకుని ఉండేవాడు పవన్. నువ్వు నాలు గేళ్ళు ఓపిక పట్టటం పెద్ద నేఱం. ప్రజలవద్దకు అప్పుడే వస్తే నమో భరతం వాళ్ళే పట్టేవారు. నీవు పడితే ఓపిక పవన్ పడితే దగానా? ఇదేం పద్దతి? చంద్రబాబు? ఏ ప్రభుత్వమైనా పన్నుల నుండే ఖర్చులు పెడతారు అదే మాకు తెలుసు. మరి మీరు హెరిటేజ్ లో సంపాధించింది ప్రజలసేవకు వినియోగించారా?   


ఎన్టీఆర్‌ ఆత్మగౌరవం కోసం పోరాడితే నేను ఆత్మవిశ్వాసం నింపేందుకు కృషిచేశా. ఎంత రెచ్చగొట్టాలని  ప్రయత్నిస్తే అంతలా పోరాడతాం. ఎన్నో కుట్రలను తెదేపా సమర్థంగా ఎదుర్కొంది. తమిళ రాజకీయాల మాదిరిగా కేంద్రం ఏపీ రాజకీయాల్లో వేలుపెట్టింది. అని చంద్రబాబు విమర్శించారు. డబ్బులు ఇవ్వకుండా, హోదా ఇవ్వకుండా మోదీ రాష్ట్రాన్ని మోసం చేశారు. చెప్పింది చేయమని అడిగితే వేరేవాళ్లను రెచ్చగొడుతున్నారు. ఇదేమి రాజకీయం అని బాబు అన్నారు. నలభయ్యేళ్ల తన రాజకీయ జీవితంలో ఎవరికీ భయపడలేదన్నారు.


"ఎన్ టి ఆర్ మీకు పిల్లనిచ్చి గొప్ప రాజకీయవైభవాన్నిస్తే మీరు ఆయనను వెనకనుండి వేటేశారంటారు. అలాంటిది ఆయనపేరు మీరు తలవటానికి కూడా మీకు అర్హత లేదంటున్నారు ప్రజలు.మద్యలో తమిళులు ఎందుకులెండి? మీరు ప్రత్యేక పాకేజ్ కోసం వత్తిడి చేశారు. అందులో కమీషన్ కోసం. మోడీ అసలే మీకంటే ముదురు పోలవరం లో మీ లీలలు, శేఖర్ రెడ్డితో మీ తనయుని సాంగత్యం దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక పాకేజి ప్రకటించి దాన్ని అతి సునాయాసంగా ఎగ్గొట్టేశాడు. సింపుల్ మీరు మీ మామను వెనక నుండి వేసేస్తే మోడీ ప్రజల ముందే మిమ్మల్ని వేటేశాడు. అదీ మీకు నోప్పి కాదుకదా! వేటేసినట్లే తెలియ కుండా?"

అసలు ముఖ్యమంత్రి స్థానంలో మరొకరుంటే ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ చక్కని రాజధానితో పోలవరం పరవళ్ళతో సుభిక్షంగా ఉండేదని ఆంధ్రప్రదేశ్ ప్రజలంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: