వైసిపికి టీడిపి మద్దతు.. జగన్ ఉచ్చు లో ఇరుక్కున్న చంద్ర బాబు నాయుడు..!

Prathap Kaluva
జగన్ ఇప్పుడు తన వ్యూహా రచనకు పదును పెట్టడం, మంచి దూకుడు ప్రదర్శించడం అందరిని ఆశ్చర్య పరుస్తుంది. రాజకీయ మేధావులు కూడా జగన్ వ్యూహ రచన కు ఆశ్చర్య పడుతున్నారు. ఎప్పుడైతే జగన్ అవిశ్వాస తీర్మాణం పెడతాను దానికి నాకు టీడిపి మద్దతు కావాలని చెప్పడం తో బాబు పూర్తి గా ఆత్మ రక్షణ లో పడిపోయాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెడుతున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలుకుతున్నట్టుగా నిర్ణయం తీసుకుందట తెలుగుదేశం పార్టీ.

ప్రస్తుతానికి అయితే ఇది లీకే. అసలు సంగతేమిటో రేపు తీర్మానంపై చర్చ, ఓటింగ్ వరకు వస్తే కానీ.. తెలియదు. అవిశ్వాసానికి మద్దతు అనే లీకులు అయితే ఇస్తూ ఉన్నారు. దీనిపై చంద్రబాబు మేధోమధనం నిర్వహించి డిసైడ్ చేశాడట. మద్దతు పలకాలని నిర్ణయించాడట. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇంతకన్నా మరో మార్గంలేదు.

అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలకకపోతే నష్టపోయేది తెలుగుదేశం పార్టీనే. ఆ నష్టం తీవ్రస్థాయిలో ఉంటుంది. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టినా.. చంద్రబాబు కదలక మెదలక కూర్చున్నాడు.. మోడీ వైపునే కూర్చున్నాడు.. అంటే అది ఏపీలో తెలుగుదేశం పార్టీని తీవ్రంగా దెబ్బతీసే అంశమే. ఎలాగూ బీజేపీని విలన్ గా చేసి.. జరిగిన దానికంతా బాధ్యత ఆ పార్టీదే అని చాటి చెప్పే వ్యూహమొకటి తెలుగుదేశం వైపు నుంచి కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో.. అవిశ్వాస తీర్మనానికి మద్దతు పలకడమే మంచి వ్యూహమని చంద్రబాబు నిర్ణయించాడని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: