ఏపి అభివృద్ది కోసం అలుపెరుగని పోరాటం..!

Narayana Molleti

నారాచంద్రబాబు నాయుడు అపార రాజకీయ చతురత కలిగిన రాజకీయ చాణిక్యుడు. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ముప్పై ఏళ్ల రాజకీయ అనుభవంతో ప్రపంచమే మెచ్చే అంతర్జాతీయ రాజధాని హైదరాబాద్ ను నిర్మించాడు. హైదరాబాద్ ను ప్రపంచపటంలో నెలకొల్పినాడు. అయితే రాష్ట్రం విడిపోయాక మరొక రాజధాని రాష్ట్రానికి అనివార్యం అయ్యింది.

 

2014 ఎన్నికల్లో చంద్రబాబునాయుడుకు, జగన్మోహన్ రెడ్డికి మద్య పోటి ఏర్పడింది. కాని తెలుగు ప్రజలు అపార అనుభవం కలిగిన చంద్రబాబునాయుడుకే పట్టం కట్టారు. విడిపోయి ఇబ్బందులు పడుతున్న రాష్ట్రానికి చంద్రబాబునాయుడే మంచి రాజధాని కట్టగలడని విశ్వసించి 2014 లో అతన్నే సిఎం ను చేసినారు. అందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అహర్నిశలు కస్టపడి, అంతర్జాతియ రాజధానిని కట్టాలనే ధృడ సంకల్పంతో ముందుకు వెళుతున్నాడు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అడుగడుగన ఇబ్బందులు ఏర్పడినా, తన రాజకీయ అనుభవం తో రాజధాని

 

నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. మొదట్లోనే రాజధానికి భూమి సేకరణ విషయంలోనే పెద్ద తలనొప్పి ఎదురైంది. కాని తన అనుభవంతో రైతులును నొప్పించకుండా, తానోవ్వకుండా రాజధానికి అవసరమయ్యే 33,000 ఎకరాల  భూమిని రైతులనుండి సేకరించాడు. ఈ విషయంలోనే తెలిసిపోతుంది తన రాజకీయ చాణిక్యత గురించి. ఇప్పటకే రాజధానికి సంభదించి డిజైన్లు ఫైనల్ స్టేజి కి వచ్చేశాయి. అయితే రాజధాని నిర్మాణం విషయంలో లేటు అవుతుంది అని విమర్శలు వుస్తున్నా, అంతర్జాతీయ స్థాయి నిర్మాణం కట్టాలంటే ఆ మాత్రం టైం పడుతుందని మరి కొందరి నుంచి వినిపిస్తున్న మాటలు.

 

ఏది ఏమైనప్పటికీ రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబు అనుభవం చాలా వరకు ఉపయోగపడుతుందన్న విషయం గ్రహించాలి. హైదరాబాద్ లాంటి రాజధానిని మరల చంద్రబాబే కట్టగలరని ప్రజలు విశ్వసిస్తున్నారు. హైదరాబాద్ నిర్మాణం కోసం సింగపూర్ వీధుల్లో తిరిగిన చంద్రబాబు నాయుడు అదే విధంగా అమరావతి నిర్మాణం కోసం దేశ, విదేశాలలో తిరుగుతున్నాడు. సిఎం ఒక యంత్రంలా పనిచేస్తున్నాడని అదే విధంగా మిగతా మంత్రులు, సంభదించిన అధికారులు పని చేస్తే ప్రజలకు సమస్యలు ఉండవని, అందరి నుంచి వినిపిస్తున్న మాటలు.


అతని కుమారుడు లోకేష్ కూడా ఐ.టి శాఖా మంత్రి గా బాగానే కష్టపడుతున్నాడు.విశాఖపట్నం కు ఐ.టి కంపెనీ లును రప్పించి తద్వారా,లక్షఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ కు తెప్పించాలనుకుంటున్నాడు. తనకు అనుభవం లేకపోయినా, తెలియని విషయాలు తెలుసుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు.ఈ విధంగా నారా కుటుంబం రాష్ట్ర అభివృద్దిలో తమదైన రీతి లో దూసుకు పోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: