మోసం చేసే పాకిస్థాన్ విషయంలో చైనా మైకం వదుల్తుందా? నిధుల విడుదల ఆపేసిన చైనా

చైనా, భారత్ పై విద్వేషంతో పాకిస్థాన్ తో స్నేహం చేస్తుందని మరోసారి ఋజువైంది. అలాగే పాకిస్థాన్ భారత్ తో పెంచుకున్న కక్ష కోసం ఏ దేశం తో నైనా స్నేహం చేయటానికి సిద్ధం. మత దురహంకారం పునాది గా ఏర్పడ్ద పాకిస్థాన్ కు ఏకపక్ష నియంతృ త్వంతో ప్రజాజీవితాన్ని మెరుగు పరచటానికి అభివృద్దే ద్యేయంగా పనిచేసే సామ్రాజ్యవాద కమ్యూనిష్ట్ దేశానికి ఏ విధంగానూ పొసగదు. కాకపోతే ఈ రెండు దేశాల "కామన్ గోల్" భారత్ అదే వీర్ని కలిపింది. అయితే ఇప్పుడు పాక్ విషయంలో చైనా కళ్ళను కమ్మిన మైకం వదిలిపోతున్నట్లే ఉంది. అయినా ఈ రెండు దేశాలని నమ్మలేం. 


చైనా-పాక్ ఎకనమిక్ కారిడార్‌ (సిపిఈసి) లో భాగంగా నిర్మించే మూడు భారీ రహదారి నిర్మాణాలకు నిధులను తాత్కాలికంగా నిలిపివేయాలని చైనా నిర్ణయించుకుంది. సీపీఈసీ లో భాగంగా 50 బిలియన్ డాలర్ల వ్యయం తో పాకిస్థాన్‌ లో ఈ నిర్మాణాలకు చైనా సాయం అందించాల్సింది. అయితే చైనా-పాక్ ఎకనమిక్ కారిడార్ నిర్మాణంలో అవినీతి జరిగిందని భావిస్తూ చైనా తీసు కున్న నిర్ణయంపై పాకిస్థాన్ ప్రభుత్వం నోరు మెదపక పోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని డాన్ పత్రిక ఓ కథనాన్ని వెలువ రించింది. చైనా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఒక ట్రిలియన్ డాలర్ల ఖర్చుతో నిర్మించే పాక్ జాతీయ రహదారుల అథారిటీపై ప్రభావం చూపనుంది.


దీని వల్ల నిర్మాణాలు మరింత ఆలస్యమవుతాయి. వీటికి సంబంధించిన నిధులను కొత్త మార్గదర్శకాల ద్వారా విడుదల చేస్తుందని ప్రభుత్వ ఉన్నతాధికారులు పేర్కొన్నట్లు డాన్ పత్రిక తెలిపింది. చైనా-పాక్ ఎకనమిక్ కారిడార్‌లో భాగంగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన "ఒన్ బెల్ట్ ఒన్ రోడ్" కోసం సుమారు 60 బిలియన్ డాలర్లను చైనా వెచ్చిస్తోంది. ఇవి పాకిస్థాన్‌లోని బలూచీస్థాన్ ప్రావిన్సుల నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా చైనాలోని జింగ్‌ యాంగ్‌ను కలుపుతాయి. చైనా నిర్ణయంతో 81 బిలియన్ డాలర్ల ఖర్చుతో 210 కిలోమీటర్ల పొడవునా నిర్మించే డేరా ఇస్మాయిల్ ఖాన్-ఝోబ్ రహదారి నిర్మాణం ఆగిపోనుంది.


మొత్తం 81 బిలియన్ డాలర్లలో రహదారి నిర్మాణం కోసం 66 బిలియన్ డాలర్లు, భూసేకరణ కోసం 15 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. అలాగే 19.76 బిలియన్ డాలర్లతో 110 కిలోమీటర్ల దూరం నిర్మించే ఖజ్దార్-బసిమియా రహదారి, 8.5 బిలియన్ డాలర్ల తో నిర్మించే రాయ్‌కోట్ నుంచి థకోట్ వరకు 136 కిలోమీటర్ల కారాకోరం జాతీయరహదారి నిర్మాణాలు ప్రశ్నార్థకంగా మారాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పాక్ ప్రభుత్వం ఈ మూడు ప్రధాన రహదారులను నిర్మిస్తోంది. కానీ వీటిని చైనా-పాక్ ఎకనమిక్ కారిడార్‌ అనుబంధ ప్రాజెక్టుగా, చైనా సాయంతో నిర్మిస్తామని 2016 డిసెంబరులో పాకిస్థాన్ జాతీయ రహదారుల అథారిటీ అధికార ప్రతినిధి ప్రకటించారు.


నాటి నాయకులు 

దీనికి అనుగుణంగా నిర్మాణాలకు అనుమతించినా, అవసరమైన కొన్ని అనుమతులను పెండింగ్‌లో పెట్టారు. గత నవంబరు 20 న జరిగిన సంయుక్త కార్యాచరణ కమిటీలో తుది నిర్ణయం తీసుకుంటారని భావించారు. కానీ కొత్త మార్గదర్శకాల ప్రకారం నిధులను చైనా మంజూరు చేస్తుందని పాక్ ప్రభుత్వం చావు కబురు చల్లగా చెప్పింది.అయితే సీపీఈసీలో అవకతవకలు జరగడంతో నిధులమంజూరుకు సుముఖంగాలేదని, కాబట్టి వాటిని తాత్కాలికంగా నిలుపుదలచేసిందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి 

నేటి నాయకులు 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: