స్లోగా... స్టడీగా... రేస్ గెలిచేందుకు సిద్ధమవుతున్న చంద్రబాబు..!

Vasishta

ఫీల్ గుడ్ ఫ్యాక్టర్.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంతా మంచిగానే ఉంది అనే భావన ప్రస్తుతం టీడీపీలో స్పష్టంగా కనిపిస్తోంది. అధినేత చంద్రబాబు కూడా ఇదే మాట చెప్తున్నారు. పాలనపై 50 శాతానికి పైగా ప్రస్తుతం ఉన్న సంతృప్తిని 80శాతానికి పైగా తీసుకెళ్లాలనే లక్ష్యాన్ని ఆయన శ్రేణులకు నిర్దేశించారు. నెగెటివ్ మైండ్ సెట్ నుంచి బయటికొచ్చి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది ఆయన ప్లాన్.


          ఎన్నికల మేనేజ్ మెంట్ లో చంద్రబాబు దిట్ట. ఎలాంటి పరిస్థితులనైనా తనకు అనుకూలంగా మార్చుకోగల నేర్పరి. ఎన్నికలకు ఇంకో ఒకటిన్నర ఏడాది టైముంది. అప్పుడే ఏపీలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. ముందస్తు ఎన్నికలొస్తాయనే అంచనా కూడా ఇందుకు ఓ కారణం కావచ్చు. అందుకే ఈ మధ్య సీఎం ఎక్కడికెళ్లినా ఎన్నికల ప్రచారం కూడా కానిచ్చేస్తున్నారు.


          గతంలో చంద్రబాబు ప్రతిపక్షాలను ఎత్తిచూపడానికే ఎక్కువ ప్రధాన్యమిచ్చేవారు. కానీ ఇప్పుడు స్ట్రాటజీ మార్చేశారు. తన చేపట్టిన స్కీములు, వాటి వల్ల జరుగుతున్న లబ్దిపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అసలు ఈ రాష్ట్రానికి ప్రతపక్షమే అక్కర్లేదంటూ సింపుల్ గా తోసిపుచ్చుతున్నారు. అంటే ప్రతిపక్షాన్ని తేలికగా తీసిపారేస్తున్నారు. వైసీపీని బలమైన ప్రతిపక్షంగా చూడడం కూడా చంద్రబాబుకు ఇష్టంలేదు. అందుకే చాలా సింపుల్ గా కొట్టిపారేస్తున్నారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోంది.


          అన్నిటికీ మించి చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ఇప్పటివరకూ చేపట్టిన పథకాలను సమగ్రంగా అధ్యయనం చేస్తున్నారు. వాటి ద్వారా ఎన్ని కుటుంబాలకు లబ్ది చేకూరుతోందో లిస్ట్ రెడీ చేయీస్తున్నారు. ప్రతి కుటుంబానికి లబ్ది చేకూరేలా ఏదో ఓ పథకంలో చేర్పించేందుకు ప్లాన్ వేశారు. త్వరలోనే ప్రతి ఇంటికీ నెలకు పది వేల రూపాయల ఆదాయం సమకూరేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. సబ్సిడీలన్నింటినీ కలిపేసి నిర్దిష్టంగా నెలకు కుటుంబానికి ఇంత మొత్తం అని ఇవ్వడం ద్వారా వాళ్లు నేరుగా నగదు పొందే అవకాశం ఉంటుందనేది చంద్రబాబు ఆలోచన.


          ప్రతినెలా ఉద్యోగస్తుడికి వచ్చినట్లే ప్రతి కుటుంబానికి నిర్దిష్ట మొత్తం చేతికందితే వారి కళ్లలో ఆనందానికి అవధులుండవనేది చంద్రబాబు ఆలోచన. అందుకే పక్కాగా ప్లాన్ సిద్ధం చేయిస్తున్నారు చంద్రబాబు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును లేకుండా చేసుకోవడం ద్వారా.. ఈసారి ధైర్యంగా ఓటర్ల ముందుకెళ్లాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. అందుకో స్లోగా... స్టడీగా.. చంద్రబాబు రేస్ గెలిచేందుకు సిద్ధమైపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: