ప్రతిపక్షాల్లోన్నుంచి తెలుగుదేశం లో చేరిన వారంతా "బర్డ్ ఆఫ్ సేం ఫెదరేనా?"

అసలు రాజకీయాలంటే ఇంత పక్కా అవకాశవాదమా? ఒక పార్టీలో ఉంటే ఒక మాట. వేరె పార్టీలొకి దూకితే వేరోమాట. మరో పార్టీలోకి కప్పదాటు వేస్తే మరోమాట. ఇదీ రాజకీయాల తీరు. "మాట్లాడే మాటల తీరు ఎప్పటికెయ్యది ప్రస్తుతమో..అప్పటికి ఆమాట లాడు" అన్న తీరు. అయితే ఈ జబ్బు ముఖ్యంగా వేరే పార్టీల్లో నుంచి తెలుగుదేశం లోకి దూకిన వారికే చాలా ఎక్కువ. తెలుగుదేశం పార్టీలో చేరితే అంతే ఉండాలేమో అలా మాట్లాదాలనేదే ఆ పార్టీ బ్రాండ్ క్వాలిటీనా? 



సొంత కుటుంబ సభ్యుల మరణాల విషయంలో కూడా ఇలా భిన్న విభిన్నమైన మాటలు అలా అలవోకగా మాట్లాడేస్తూ ఉంటారు ఈ రాజకీయనాయకులు. ప్రస్తుతం ఇదే జాబితాలో తెలుగుదేశం యువ మంత్రి భూమా అఖిలప్రియ కూడా చేరిపోయారు. అఖిలప్రియ చాలా లేటుగానైనా లేటెస్ట్ గా మరీ తాజాగా నంద్యాల్లో కొత్త బాంబు పేల్చింది. 


అదేమిటంటే, తన తండ్రి భూమా నాగిరెడ్డి మరణానికి కారణం శిల్పా మోహన్ రెడ్డే నట! భూమా నాగిరెడ్డి మరణానికి కారణం అయిన శిల్పా మోహన్ రెడ్డికి జగన్ టికెట్ ఇచ్చాడట. అందుకే వారికి బుద్ధి చెప్పాలని ఈమె నంద్యాల జనులకు పిలుపు నిచ్చింది. మరి భూమా నాగిరెడ్డి మరణానికి శిల్పా మోమన్ రెడ్డి ఎంత వరకూ కారణం? అనేది అఖిలప్రియ బుర్రకే తెలియాలి. ఇంత చెత్తగా మాట్లాడే అఖిల ప్రియ పార్టీకి నంద్యాల ప్రజలు ఓట్లు వేస్తారా అనేది పెద్ద ప్రశ్న.




భూమా నాగిరెడ్డి మరణించి సుమారుగా మూడు నెలలు మాత్రమే. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో మరణించారో? అందరూ గమనించారు. ఈ స్వల్ప సమయం లోనే ప్రజలు మరీ నంద్యాల ప్రజానీకం మరచిపోతారా? అఖలప్రొయ కూడా అప్పట్లో "నా తండ్రికి ఏమైనా అయితే దానికి చంద్రబాబే కారణం" అని గొంతెత్తి అన్నరు కదా! మరి అలా అన్న ఈ యువ మంత్రి ఇప్పుడు చంద్రబాబుకు పక్కన నిల్చుని "శిల్పా మోహన్ రెడ్డే తన తండ్రి మరణానికి కారణం" అని అంటుంటే వింటున్న నంద్యాల ప్రజలు ఆశ్చర్యం తో పాటు విస్మయం పొందుతున్నారు. 




అవసరాన్ని బట్టి, తన తండ్రి మరణానికి కారణం ఒకసారి చంద్రబాబు అని, మరోసారి శిల్పా మోహన్ రెడ్డి అని, అనే ఈ అఖిల ప్ర్యపై నంద్యాల జనాలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు! అంతకు మించి యావగించు కుంటున్నారు. ఇంత చిన వయసు లోనే మంత్రై పోవటం అధికార దురహంకారం తలకెక్కటం జరిగి, అధికార తిమిర అంధకారములో ఆమె కొట్టుమిట్టాడుతుంద ని ఇప్పుడే ఈమెకు "చెక్" పెట్టకపోతే ఈమె భవిష్యత్ లో నంద్యాలకు శనిలా దాపురించి కొన్నేళ్ళైనా ఆ నియోజక వర్గాన్ని పట్టి పీడించవచ్చని అనుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: