
ఏపీ: చంద్రబాబుకు, జగన్ కు తేడా అదేనట: మంత్రి రోజా
అదే చంద్రబాబు అయితే చెప్పింది ఏనాడూ చెయ్యరని రోజా ఈ సందర్భంగా సైటర్లు వేశారు. గత ప్రభుతంలో అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు ఏం చేశారు? తరువాత ఇప్పుడు జగనన్న గడిచిన ఐదు ఏళ్లలో ఏం చేశారు? అని పోల్చుకుంటే సరిపోతుందని, ప్రజలకు నిస్వార్థంగా సేవ చేశారో ఇట్టే తెలిసిపోతుందని మంత్రి రోజా ఓ లాజిక్ చెప్పారు. జగనన్న పాలనలో గొప్పగా జరిగిన అభివృద్ధి గురించి తెలుసుకోవాలంటే చంద్రబాబు పాలన, జగనన్న పాలనను పోల్చుకుంటే సరిపోతుందని ఈ సందర్భంగా రోజా పలికారు. సీఎం జగన్ బీసీలను ఆయన ప్రభుత్వంలో బ్యాక్ బోన్ గా చూసుకుంటారని, అదే చంద్రబాబు బీసీలను కులంగానే మాత్రమే గుర్తిస్తారని మంత్రి రోజా ఆరోపించారు.
ఇంకా జగన్ గురించి రోజా మాట్లాడుతూ... "బీసీ అయిన డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం ఎమ్మెల్సీ అయ్యారంటే చూసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 11 మందికి బీసీలకు మంత్రి పదవులు ఇవ్వడం ఆ బాబు బాబు వల్ల కూడా కాదు. భరత్ ను ఎమ్మెల్సీ చెయ్యడమే కాకుండా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చెయ్యడానికి జగనన్న ఓ అవకాశం ఇచ్చారు. సీఎం జగన్ బీసీలకు ఇచ్చిన గుర్తింపులో ఇది ఒక మచ్చుతునక మాత్రమే!" అని మంత్రి రోజా అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దూరం అవుతుందని, పొరపాటున కూడా ఆ పార్టీకి ఓట్లు వెయ్యకూడదని మంత్రి రోజా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.