ఆ మాటపై అభ్యంతరం.. చంద్రబాబుపై కేసు..!

Chakravarthi Kalyan
జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రం విడిపోయిన రోజు కావడంతో ఏపీలో ఆ రోజు నవ నిర్మాణ దీక్షలు చేపట్టాలని చంద్రబాబు మూడేళ్లుగా పిలుపు ఇస్తూ వస్తున్నారు. ఓవైపు తెలంగాణలో ఆవిర్భావ వేడుకలు.. మరోవైపు ఏపీలో నవ నిర్మాణ దీక్షలు మూడేళ్లుగా కామన్ అయ్యాయి. 


ఐతే.. మొన్నటి నవనిర్మాణ దీక్ష రోజు చంద్రబాబు మాట్లాడుతూ.. జూన్ 2 ను ఏపీ చరిత్రలో చీకటి రోజుగా వర్ణించడం తెలంగాణ వాదుల మనో భావాలను కించపరిచింది. రాష్ట్రం విడిపోయి మూడేళ్లవుతున్నా.. ఇంకా చంద్రబాబు తెలంగాణపై విషం కక్కుతూనే ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. తెలంగాణకు చెందిన మీడియా సంస్థలు కూడా ఈ ఇష్యూను హైలెట్ చేశాయి. 



ఇప్పుడు ఈ అంశంపై పోలీస్ కేసులూ నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ఏపీలో బ్లాక్ డేగా జరుపుకోవాలని వ్యాఖ్యానించిన చంద్రబాబుపై పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. టీఎస్ ముస్లిం పొలిటికల్ జేఏసీ, కేటీఆర్ యువసేన ఆధ్వర్యంలోని బృందం పెద్దపల్లి ఏసీపీ సింధూశర్మను కలిసి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు తెలంగాణఅమరవీరులను కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐతే.. ఇలాంటి కేసులు పెట్టడం.. ఆ తర్వాత అవి వాదనకు నిలవకపోవడం సాధారణంగా మారింది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: