దమ్ముంటే మా ఈవిఎం లను ట్యాంపర్ చేసి చూపండి: ఈసి ఓపెన్ చాలెంజ్




చాలా కాలం నుండి ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకొచ్చి ఎన్నికల సంఘం ఎన్నికల్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను టాంపర్ చేసే వీలుందని అలా చేసే బాజపా గెలుస్తూ వస్తుందని అటు డిల్లి లో ఆం ఆద్మి పార్టి, ఇటు యూపి లో ఎస్పి బిఎస్పి ద్వయం, బెంగాల్లో మమత, ఉభయ కమ్యూనిష్టులు ఇలా అనెక మంది చేసే పిర్యాదులతో ఎన్నికల సంఘం విసిగి పోయి ఉంటుంది. అందుకే ధమ్ముంటే మా ఈవిఎం లను ట్యాంపర్ చేసి చూపండి అని ఈసి అన్నీ పార్టీలకు ఓపెన్ చాలెంజ్ చేసింది. నిజం చెప్పాలంటే అరవింద్ కేజ్రీవాల్ డిల్లీ పాలనను పూర్తిగా వదిలేసి ఇదే పని మీద ఉన్నారని అనెకమంది ఆరోపిస్తూనే ఉన్నారిప్పటికి. 


   
తాము ఎన్నికల్లో ఇన్నాళ్లుగా  ఉపయోగిస్తున్న ఈవీఎం ఈ నెలాఖరులో మీముందుకు తెస్తామని, దమ్ముంటే ఎవరైనా సరే వాటిని హ్యాక్ చేయడం లేదా ట్యాంపరింగ్ చేయడం గాని చేసి మాకందరికి చూపించాలని ఎన్నికల కమిషన్ బహిరంగ సవాలు చేసింది. మొత్తం 55 రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈసీ  నిర్వహించిన సమావేశం లో 16 పార్టీలు మళ్లీ బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశాయి. దానికి ఈసీ అధికారులు సీరియస్గానే స్పందించి తాము ఈ నెలాఖరులో ఓపెన్ చాలెంజ్ నిర్వహిస్తామని, అందులో ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే తమ ఈవీఎం లను ట్యాంపర్ చేసి చూపించాలని సవాలు చేశారు. 


ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వివిధ కోర్టులలో ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి 37 కేసులు నమోదయ్యాయని, వాటిలో ఇప్పటికే 30 కేసుల్లో తీర్పులు రాగా, వాటన్నింటిలో కూడా ఈవీఎం లను ట్యాంపర్ చేయడం కుదరదనే చెప్పారని ఢిల్లీ రాజౌరి గార్డెన్ ఎమ్మెల్యే మన్‌జీందర్ సింగ్ సిర్సా తెలిపారు.


ప్రభుత్వం తలపెట్టిన ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ త్రయల్ (వీవీపాట్) నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్ స్వాగతించింది. ఇప్పటికే తమకు ఈ మిషన్ల కొనుగోలుకు సంబంధించి నిధులు కూడా అందాయని, 2019 నాటికి వీటిని ఉపయోగంలోకి తెస్తామని ఈసీ వర్గాలు తెలిపాయి. 


"ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అసెంబ్లీలో హ్యాక్ చేసి చూపించింది తమ ఈవీఎంలా కనిపించేదే తప్ప అసలుది కాదని" ఈసి స్పష్టం చేసింది. ఈవీఎం లు నూటికి నూరు శాతం విశ్వాసం ఉంచతగినవేననే విషయాన్ని ప్రతి భారతీయుడికి ఎన్నికల కమిషన్ చెప్పగలగాలని, అది వాళ్ల బాధ్యత అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: