ఉరిశిక్షకైనా సిద్ధం-ఉమాభారతి




కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో విచారణకే కాదు, అవసరమైతే తాను ఉరి తీయించు కోడానికైనా తాను సిద్ధమేనని అది తన జీవిత లక్ష్యమని నిర్ద్వందంగా స్పష్టం చేశారు. విచారణకు రెండు గంటలు పట్టినా, రెండు సంవత్సరాలు పట్టినా తాను దాని కోసం నిరీక్షిస్థానని తాను కేసును నిర్భయంగా ఎదుర్కొంటానన్నారు. న్యాయ స్థానం తీర్పు వెల్లడించిన తర్వాత తాను ఎవరితోనూ మాట్లాడలేదని, ఎవరిని సంప్రదించలేదని, ఎట్టి పరిస్థితు ల్లోనూ రామ మందిరాన్ని నిర్మించాలనే తన తపనను తాను ఘట్టిగా బల్లగుద్ది చెప్పాలనుకుంటున్నానని అన్నారు. 




తనను రాజీనామా చేయమని అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని, "తిరంగా వివాదం" సమయంలో తన మీద ఆరోపణ లు రుజువయ్యాయి కాబట్టే తాను అప్పట్లో రాజీనామా చేశానని అన్నారు. తాను ఈరోజూ అయోధ్య వెళ్ళగలనని, కాంగ్రెస్ ఆరోపణల మీద, తాను రాజీనామా చేయాలన్న వాళ్ల డిమాండు మీద ఏమాత్రం స్పందించ బోనని తనకా అవసరం లేదని తెలిపారు. అసలు ఏ విషయమైనా తనకు చెప్పడానికి వారెవరని ఆమె తీక్షనంగా ప్రశ్నించారు.




 
దేశములో అత్యాయక పరిస్థితిని విధించింది కాంగ్రెస్ వాళ్లు, బలవంతంగా ముస్లింలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించింది కాంగ్రెస్ వాళ్లు, 1984 మత ఘర్షణ లకు కారణ భూతమైంది కాంగ్రెస్ వాళ్లే నంటూ ఉమాభారతి మండిపడ్డారు. రామ మందిరాన్ని తాము కట్టాలన్న విషయంలో ఎలాంటి అనుమానం లేదని, రామ మందిరం అంశం వల్లే తాము అధికారం లోకి వచ్చామని ఆమె చెప్పారు. ఎలాంటి తీర్పు నైనా అవసరమైతే ఉరి శిక్షనైనా ఎదుర్కోడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నానని తెలిపారు.



ఈ మొత్తం వ్యవహారంలో ఎలాంటి దగా, కుట్ర, కుతంత్రం లేదని, అంతా బహిరంగంగానే, తేటతెల్లంగానే ఉందని ఆమె నిస్సంకోచంగా చెప్పారు. తన ఉద్దేశం, చర్యలు అన్నీ ఒకటేనని, తాను రామమందిర ఉద్యమంలో పాల్గొన్నానని కూడా ఉమాభారతి చెప్పారు. అన్నిటికి భాధ్యత వహిస్తానని ఉమాభారతి చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: