చెల్ల కుండాపోయిన కొంతమంది టీచర్లు, పట్టభధ్రులు!

Kuthuru Raji Reddy
ఉపాధ్యాయులంటే అందరికి గౌరవం ఉంటుంది, అంతేకాదు వారు అన్ని తెలిసినవారని, వారిపాత్ర సమాజంలో కీలకమని అనుకుంటారు. కాగా పాపం కొంతమంది ఉపాధ్యాయులకు ఓటుకూడా ఎలా వేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. కరీంనగర్ నియోజకవర్గానికి జరిగిన టీచర్స్ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో కేవలం 18వేలమంది ఉపాధ్యాయుల ఓట్లు పోలైయితే అందులో 299మంది ఉపాధ్యాయుల ఓట్లు చెల్లకుండా పోయాయంటే వారు ఓటు ఏవిధంగావేశారో స్పష్టం అవుతుంది. ఈ విషయం చర్చించుకుంటే మన పరవుమనమే తీసుకున్నవారమవుతాముగాని ఓటు ఎలావేయాలో తెలియని టీచర్లు కూడా ఉండడం విచిత్రం,వింత, అన్నింటికి మించి సిగ్గుపడేలా ఉంది. సామాన్య ప్రజలు, అనామకులు సైతం డమ్మి బ్యాలెట్ చూపించి రెండుసార్లు చెబితే వారు అదే విధంగా వారికి నచ్చిన గుర్తుపై ఓటేసి వస్తారు. కాగా అన్ని తెలిసినవారు చదువుల్లో ఉన్నటువంటి సారాన్ని విప్పిచెప్పేటువంటి “సారు” ల ఓట్లు చెల్లకుండా పోయాయంటే తలచుకుంటేనే అవమానంగా ఉంది. అంతే కాదు తాము డిగ్రీ పట్టా పుచ్చుకున్నామని భుజాలు వెగిరేసుకుంటున్నటువంటి కొంత మంది పట్టభధ్రులకు కూడా ఓటు ఎలా వేయాలో తెలియకపోవడం విచారకరం. స్పష్టంగా బరిలోకి దిగినటువంటి అభ్యర్థుల పేర్లు, వాటికి ఎదురుగా బాక్స్ లున్నాయి. వాటిలో అక్కడున్నటువంటి ఎన్నికల అధికారులిచ్చేటువంటి పెన్నుతో వారికిష్టమొచ్చిన బాక్స్ లో నెంబర్ వేస్తే సరిపోతుంది. దీంతో ఓటు చెల్లుబాటవుతుంది. కాగా ఇటువంటి చిన్నవిషయంలో కూడా పట్టభధ్రులు పొరపాటుగా చెల్లకుండా ఓటువేశారంటే ఎమనుకోవాలి. ఒక్కరో, ఇద్దరో అనుకుంటే పొరపాటే అవుతుంది. కాగా వేల ఓట్లు చెల్లకుండా పోయాయి. దీన్నిబట్టి వారు చదువుకున్న చదువుల్లో సారంలేదా, లేకపోతే వారికి ఓటుకూడా వేయడం తెలియదా అనేది విషయం తెలిసిన వారిని వేదిస్తున్న ప్రశ్నలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: