మాజీ మంత్రి సరోజిని పుల్లారెడ్డి కన్నుమూత

Kuthuru Raji Reddy
మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సరోజిని పుల్లారెడ్డి ఆదివారం ఉదయం కన్నుమూశారు. 50సంవత్సరాల పాటు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న సరోజిని పుల్లారెడ్డి వయస్సుమీద పడడంతో విశ్రాంతి తీసుకున్నారు. దాదాపు 90సంవత్సరాల వయస్సుగల సరోజిని పుల్లారెడ్డి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నేడు తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగువెలిగిన సరోజిని పుల్లారెడ్డి హైదరాబాద్ కు తొలిమేయర్ గా ఎన్నికయ్యారు. దీంతో పాటు ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా పదవులు నిర్వహించి పదవులకు న్యాయం చేశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర వర్కింగ్ కమిటీ సభ్యురాలుగా కూడా కొంతకాలం పనిచేశారు. సరోజిని పుల్లారెడ్డి అంత్యక్రియలు బోయినిపల్లి స్మశాన వాటికలో మధ్యాహ్నం మూడుగంటలకు జరుగుతాయి. కాగా సరోజిని పుల్లారెడ్డి మరణం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కే.రోశయ్యతో పాటు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సంతాపం తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: