‘మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను’:విజయమ్మ

‘మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను’:విజయమ్మ హైదరాబాద్: మంగళవారం నాడు అనంతపురం జిల్లాలో పర్యటించిన వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, ఆమె కూతురు షర్మిలకు ప్రజలు బ్ర హ్మరథం పట్టారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ దివంగత రాజశేఖర్ రెడ్డిని మీ గుండెల్లో పెట్టుకున్నారు. ఓదార్పు సందర్భంగా మీ ముందుకు వచ్చిన జగన్ను ఆశీర్వదించారు. ఇప్పుడు కష్టకాలంలో ఉన్న మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఇంతగా తమ కుటుంబం పట్ల ఆదరాభిమానులను చూపిస్తున్న మీకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలమన్నారు. మీరు చూపెడుతున్న అభిమానానికి తాము ఎంత చేసినా తక్కువేనని అన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పేదల కోసం సంక్షేమ పథకాలను చేపట్టడమే తప్పన్నట్లుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఏ మూలన ఏం జరిగినా దానికి జగనే బాధ్యుడంటున్నారు కాంగ్రెస్ పెద్దలు. జగన్ ఏనాడు సచివాలయానికి వెళ్లలేదన్నారు. లక్ష కోట్లు సంపాదిస్తే జగన్ సిమెంటు ఫ్యాక్టరీని ఎందుకు అమ్ముతాడో మీరే చెప్పాలన్నారు తమ కుటుంబం పట్ల కాంగ్రెస్ సాధిస్తున్న కక్షసాధింపు చర్యలపై న్యాయం కోసం నేను మీ ఆడపడుచునై వచ్చా. మీరే న్యాయరక్షకులు, మీరే ధర్మరక్షకులన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: