భైంసాలో బాబు పాదయాత్ర ఉద్రిక్తం

Priyanka Reddy
ఆదిలాబాద్ జిల్లా చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండో రోజు పాదయాత్రను చంద్రబాబు మధోల్ నుంచి ప్రారంభించారు. పాదయాత్ర భైంసాకు చేరుకోగానే.. మాలమహానాడు కార్యకర్తలు నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు పూర్తి మద్దతు ప్రకటించడాన్ని మల మహానాడు నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో చంద్రబాబును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో పోలీసులు జోక్యం చేసుకోవడంతో వారిపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో సీఐతోపాటు పలువురికి గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పలువుర్ని అరెస్ట్ చేశారు.  తెలంగాణ మాలమహానాడు కార్యకర్తలపై దాడిని తెలంగాణ మాల మహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకర్ ఖండించారు. అరెస్టు చేసిన కార్యకర్తలను విడుదల చేయాలని లేకుంటే.. జరిగే పరిణామాలకు చంద్రబాబు, ఆ పార్టీ తెలంగాణ నేతలదే బాధ్యతని దయాకర్ హెచ్చరించారు. లేనిపక్షంలో హైదరాబాద్‌లోని టీడీపీ కార్యాలయాన్ని తగులబెడతామని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: