మ‌హారాష్ట్ర పీఠం ఎవ‌రిది.... స‌మీక‌ర‌ణ‌లు ఏం చెపుతున్నాయ్‌..!

VUYYURU SUBHASH
ప్రస్తుతం దేశవ్యాప్తంగా మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో ఆ రెండు రాష్ట్రాల మీద అంద‌రి కాన్‌సంట్రేష‌న్‌ నెలకొంది. ఉత్తరప్రదేశ్ తర్వాత లోక్‌స‌భ స్థానాలు పరంగా పెద్ద రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్ర, అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 21న జరగనున్నాయి. 24న ఓట్ల లెక్కింపు జరగనుంది. దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరంతో పాటు రిజర్వ్ బ్యాంక్... స్టాక్ ఎక్సేంజ్ తో పాటు పలు ప్రభుత్వ... ప్రైవేటు రంగాలకు కేంద్రంగా ఉన్న ముంబాయి నగరం ఉన్న రాష్ట్రం కావడంతో మహారాష్ట్ర ఎన్నికలను కార్పొరేట్ శ‌క్తులే శాసిస్తున్నాయ‌న్న ప్రచారం జరుగుతోంది. కార్పొరేట్ శ‌క్తులు ఎన్నిక‌ల‌కు నిధులు స‌మ‌కూర్చుతుండ‌డం మాత్రం నిజం.


మహారాష్ట్రలో ఉన్న స్థానిక పరిస్థితులను బట్టి జాతీయ స్థాయిలో ప్రధాన పార్టీలు గా ఉన్న బిజెపి, కాంగ్రెస్ స్థానిక పార్టీలుగా ఉన్నా శివసేన.. ఎన్సీపీతో పొత్తు పెట్టుకున్నాయి. బిజెపి శివ‌సేన‌ - కాంగ్రెస్.. ఎన్సీపీ తో కలిసి ఎన్నికల క్షేత్రంలోకి దూకాయి. 2014 ఎన్నికల్లో నాలుగు పార్టీలు వేర్వేరుగా పోటీచేశాయి. ఈ ఎన్నికల్లో 120కి పైగా స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచిన బిజెపి చివరకు శివసేన మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐదేళ్ల పాటు బీజేపీ మధ్య కలహాల కాపురం కొనసాగుతూనే ఉంది.


ఇక ఈక్వేష‌న్లు చూస్తే ముంద‌స్తు అంచ‌నాల ప్ర‌కారం చూస్తే బీజేపీ, సేన కూటమి బలంగా ఉన్నట్లు కనపడుతోంది. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 23, శివసేన 18 స్థానాలు సాధించి స్పష్టమైన ఆధిక్యత కనబరిచాయి. {{RelevantDataTitle}}