ఏపీ: నిరుద్యోగులకు గుడ్ న్యూస్1400 పోస్టుల భర్తీ.. మంత్ర కీలక ప్రకటన..!
ఇప్పటికే ఆరు గురుకుల పాఠశాలలను కాలేజీలుగా అప్గ్రేడ్ చేశామని, ఎంటిఎఫ్ కు రూ. 420.75 కోట్ల రూపాయలు ఇచ్చామని ,ఫీజు రిమెంబర్స్ కింద రూ. 933 కోట రూపాయల కేటాయించామంటూ మంత్రి సవిత తెలియజేశారు. బీసీలకు స్కాలర్షిప్స్ కోసం రూ. 145 కోట్ల రూపాయలు విడుదల చేయగా దీని ద్వారా 3 లక్షల 5,840 మంది విద్యార్థులు లబ్ది పొందారని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వెనుకబడిన కులాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని, బీసీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నామంటూ తెలిపారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 20 నెలలు కావస్తోంది డిబిటి, నాన్ డిప్యూటీ విధానంలో అటు తల్లికి వందనం, దీపం 2 పథకం కింద, ఆటో డ్రైవర్స్ కు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇలా మరెన్నో పథకాల ద్వారా ఒక కోటి 59 లక్షల 99 వేల34 మంది బీసీలకు లబ్ధి చేకూర్చామని మంత్రి సవిత వెల్లడించారు. బీసీలను అన్ని విధాలుగా ముందుకు నడిపించే పార్టీ టిడిపి పార్టీని అంటూ తెలియజేసింది. ప్రతి బీసీ కుటుంబంలో పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలన్నదే సీఎం చంద్రబాబు సంకల్పమని ఆ దిశగానే అడుగులు వేస్తున్నామంటూ తెలిపారు.